డోంట్ మిస్ : రెడ్ మి నోట్ 7 ప్రొ.. సేల్ టుడే : ధర ఎంతంటే?

Submitted on 13 March 2019
Dont miss : Xiaomi Redmi Note 7 Pro to go on sale today

సమ్మర్ సేల్ మొదలైంది. సమ్మర్ ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్న స్మార్ట్ ఫోన్ యూజర్లు ఇక పండగే. ఇప్పటికే మొబైల్ మార్కెట్లో కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ల సేల్స్ సందడి మొదలైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెడ్ మి నోట్ 7 ప్రొ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లలోకి వచ్చేసింది. ప్రముఖ మొబైల్ మేకర్ జియోమీ కంపెనీ రెడ్ మీ నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ సేల్స్ ను ఇండియాలో తొలిసారి ప్రారంభించింది. బుధవారం (మార్చి 13, 2019) మధ్యాహ్నం 12:30 గంటల నుంచే రెడ్ మి నోట్ 7 ప్రొ సేల్స్ మొదలయ్యాయి. స్మార్ట్ ఫోన్ యూజర్లంతా రెడ్ మీ నోట్ కొత్త స్మార్ట్ ఫోన్ల కోసం క్యూ కట్టేశారు. అదిరిపోయే ఫీచర్లతో యూజర్లను ఎట్రాక్ట్ చేస్తున్న రెడ్ మి నోట్7 ప్రొను సొంతం చేసుకునేందుకు యూజర్లంతా పోటీ పడుతున్నారు.
Read Also : ఇండియాలో లాంచ్ : యూట్యూబ్ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసు వచ్చేసింది

జియోమీ కంపెనీ వెబ్ సైట్లు Mi.com, MI Home, ఈ కామర్స్ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం Filpkart వెబ్ సైట్లో రెడ్ మి నోట్ 7 ప్రొ సేల్స్ సునామీ సృష్టిస్తోంది. రెడ్ మి నోట్7 ప్రొ మోడల్ ఫోన్ లో 48 మెగా ఫిక్సల్ కెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇండియాలో Redmi Note 7 pro ప్రారంభ ధర రూ.13వేల 999 నుంచి అందుబాటులోకి ఉంది. రెండు వేరియంట్లపై జియోమీ ఈ ఫోన్ ను అందిస్తోంది. 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజీ తో పాటు 6GB RAM, 128 GB స్టోరేజీ వేరియంట్ అందిస్తోంది. దీని ప్రారంభ ధర మార్కెట్ లో రూ.16వేల 999 నుంచి అందుబాటులో లభ్యమవుతోంది. ఈ ధర ఫోన్లపై 4కే వీడియో రికార్డింగ్ ఆప్షన్ ను జియోమీ తొలిసారి యూజర్లకు అందిస్తోంది. 

మరోవైపు అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్ టెల్ నెట్ వర్క్ పై రెడ్ మి నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై కస్టమర్లకు కొన్ని ఆఫర్లు అందిస్తోంది. ఈ ఫోన్ కొనే యూజర్లకు డబుల్ డేటా ఆఫర్ ఇస్తోంది. ప్రీపెయిడ్ రీఛార్జ్ లపై 100 శాతానికి పైగా డేటాను అందిస్తోంది. థాంక్స్ ఎయిర్ టెల్ డేటా బెనిఫెట్స్ 1120 జీబీ వరకు ప్రీపెయిడ్ కస్టమర్లకు అందిస్తోంది. ఇందులో ఎయిర్ టెల్ డేటా సెక్యూర్ (నార్తన్ యాంటీవైరస్) కూడా ఫ్రీగా పొందొచ్చు. Airtel TV ప్రీమియం సహా పలు ఆఫర్లను ఫ్రీగా యాక్సస్ చేసుకోవచ్చు. యాక్సస్ బ్యాంకు బజ్ క్రెడిట్ కార్డుపై 5 శాతం వరకు ఎక్స్ ట్రా బెనిఫెట్స్ పొందొచ్చు. 

అదిరిపోయే ఫీచర్లు ఇవే.. 
* 6.3 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిసిప్లే, 
* 19.5:9 రేషియో, బ్యాక్ సైడ్ గొరిల్లా గ్లాస్ ప్యానెల్ 
* క్వాల్ కామన్ స్నాప్ డ్రాగన్ 675 అక్టా కోర్ ప్రాసిసెర్ 
* 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ 
* 48 మెగాఫిక్సల్ రియర్ కెమెరా లెన్స్
* 5 మెగా ఫిక్సల్ సెకండరీ డిఫ్త్ సెన్సార్
* 13 మెగా ఫిక్సల్ కెమెరా సెన్సార్ ఫ్రంట్ సైడ్ (సెల్ఫీ కెమెరా)
* ఏఐ సీన్ డిటెక్షన్, ఏఐ పొర్టట్రయట్ 2.0, నైడ్ మోడ్ 
* 4కే వీడియో రికార్డింగ్, 4జీ వోల్ట్, వై-ఫై 802.11ఎసీ
* బ్లూ టూత్ V5.0, GPS/A-GPS, USB టైప్-సి పోర్ట్
* 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్
* ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ (బ్యాక్ సైడ్)
* 4000ఎంఎహెచ్ బ్యాటరీ, క్విక్ ఛార్జ్ 4.0 సపోర్ట్
* డ్యుయల్ కెమెరా సిమ్ (Nano)
* ఆండ్రాయడ్ 9పై, MIUI 10
* నెపుట్యూన్ బ్లూ, నెబ్యులా రెడ్, స్పేస్ బ్లాక్ కలర్

XIAOMI
redmi note 7 pro
redmi
sale today
Mobile markets
Smart Phones
Filpkart
MI Home

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు