ATMలో డబ్బులు డ్రా చేస్తున్నారా.. జర జాగ్రత్త

Submitted on 14 March 2019
Don't Do This To Your Debit Cards, Else You Will Permanently Damage It

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు అన్ని బ్యాంకులు EVM CHIP కార్డులను జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇంకా EVM కార్డు తీసుకొని వారు బ్యాంకుకు వెళ్లి కొత్త కార్డు తీసుకోవచ్చు. మెరుగైనా భద్రతా, కార్డు మోసాలను నియంత్రించేందుకు RBI ఈ నిబంధనను తీసుకువచ్చింది. 

దేశవ్యాప్తంగా ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ EVM కార్డులకు అనుగుణంగా ఉన్న ATMలను కొత్త సాంకేతికతతో అప్‌గ్రేడ్ చేశాయి. ఇందులో కార్డు ట్రాన్జాక్షన్ పూర్తి అయ్యేంత వరకు కార్డు లాక్ అవుతుంది. ట్రాన్జాక్షన్ పూర్తి అయిన తర్వాత ATM కార్డు లాక్ ఓపెన్ అవుతుంది...ఈ విషయం తెలియక చాలా మంది కార్డును డ్యామేజ్ చేసుకుంటున్నారు.

అందుకే దేశంలోని బ్యాంకులన్ని కస్టమర్లను ATM లలో డబ్బులు విత్‌డ్రా చేసుకునే సమయంలో కార్డులను జాగ్రత్తగా వాడాలని హెచ్చరిస్తున్నాయి. లేదంటే కార్డు డ్యామేజ్ అయ్యే అవకాశముందని పేర్కొంటున్నాయి. డబ్బులు డ్రా చేసే సమయంలో ATM మెషీన్లలో డెబిట్ కార్డు లాక్ అవుతుందని, ఈ విషయం చాలా మందికి తెలియక కార్డును బలవంతంగా బయటకు తీస్తున్నారని ICICI బ్యాంక్ తెలిపింది. ఇలా చేయడం వల్ల కార్డులోని చిప్ డ్యామేజ్ అయ్యే అవకాశముందని పేర్కొంది. ఇప్పటికే పలు కస్టమర్ల కార్డులు పనిచేయలేదని ఫిర్యాదులు అందాయని తెలిపింది.

Debit Card Locked
Money withdraw
Debit Cards
ATM Cards Dameged

మరిన్ని వార్తలు