అతను జంతువులతో మాట్లాడతాడు : ‘డూలిటిల్’ - ట్రైలర్

Submitted on 14 October 2019
అతను జంతువులతో మాట్లాడతాడు

హాలీవుడ్ మేకర్స్ ఎలాంటి కాన్సెప్ట్స్‌తో అయినా ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేయగలరు. మనిషికి జంతువుల భాష అర్థమైతే.. ఎంచక్కా వాటితో మనిషి మాట్లాడగలిగితే ఎలా ఉంటుంది? వినడానికే ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదూ!.. ఇదే కథతో ‘డూలిటిల్’ అనే సినిమా రూపొందుతుంది.

రాబర్ట్ డౌనీ జూనియర్ హీరోగా నటిస్తున్నాడు. స్టీఫెన్ గఘన్ దర్శకత్వంలో, యూనివర్సల్ పిక్చర్స్ నిర్మిస్తున్న ‘డూలిటిల్’ ట్రైలర్ రిలీజ్ చేశారు. డాక్టర్ ‘డూలిటిల్’ క్యారెక్టర్‌లో రాబర్ట్ కనిపిస్తున్నాడు. తనకున్న అద్భుతమైన శక్తి ద్వారా జంతువులతో మాట్లాడుతూ.. వాటి కష్టసుఖాలను పంచుకుంటూ.. వాటికి మంచి ఫ్రెండ్‌లా మారిపోతాడు.


Read Also : నీకో కథ చెప్తా.. ‘ఏడు చేపల కథ’ - ట్రైలర్

ఎలుగుబంటి, గొరిల్లా, సింహం, పులి, జిరాఫీ, నక్క, కుక్క, రామ చిలుక, బాతు ‘డూలిటిల్’ ఫ్రెండ్స్.. టామ్ హోలాండ్, సెలెనా గోమెజ్, ఎమ్మా థాంప్సన్ వంటి పాపులర్ నటులు డబ్బింగ్ చెప్పడం విశేషం. 2020 జనవరి 17న ‘డూలిటిల్’ రిలీజ్ కానుంది.

 

Robert Downey Jr
Emma Thompson
Stephen Gaghan
RK Films
Team Downey

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు