ఆస్కార్ రేస్‌లో మోతీ భాగ్

Submitted on 19 September 2019
Documentary film Moti Bagh Nominated for Oscar

ఉత్తరాఖండ్‌లో నివసించే విద్యుత్‌ అనే 83 ఏళ్ల రైతు జీవితం ఆధారంగా దర్శకుడు నిర్మల్‌ చందర్‌ దండ్రియాల్‌ ‘మోతీ భాగ్‌’ అనే డాక్యుమెంటరీ రూపొందించారు. ఈ డాక్యుమెంటరీలో ప్రస్తుత కాలంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది? వాళ్లు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఎందుకు వలస వెళ్లిపోతున్నారు అనే అంశాలను ప్రస్తావించారు. 

ఈ డాక్యుమెంటరీ చిత్రం ఆస్కార్‌కు నామినేట్‌ అయిందని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ ఇటీవల ప్రకటించారు. ‘ఇలాంటి సినిమాలే యువతను తమ ప్రాంతాల్లోనే ఉండేలా ప్రేరణనిస్తాయి. వలసలు వెళ్లిపోవడాన్ని కూడా తగ్గిస్తాయి.. ‘మోతీ భాగ్‌’ టీమ్‌కు కంగ్రాట్స్‌’ అని ఆయన తెలిపారు.

అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నిర్మల్‌ చందర్‌ దండ్రియాల్‌ గత రెండు దశాబ్ధాలుగా ఫీల్డ్‌లో ఉన్నారు. రీసెర్చర్, రైటర్, సినిమాటోగ్రాఫర్, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్‌గా ఆయన రూపొందించిన డాక్యూమెంటరీలు ప్రశంసలు అందుకున్నాయి.

Moti Bagh
Moti Bagh Nominated for Oscar
Documentary on Indian farmer’s life

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు