అలర్ట్ హైదరాబాద్ : ఆ టపాసులు విక్రయిస్తే కేసులే

Submitted on 23 October 2019
Diwali PCB Survey

మరో నాలుగో రోజుల్లో దీపావళి వస్తోంది. ఈ పండుగ అంటేనే బాంబులు, పటాకులు లేదా టపాసుల గోలతో వెలిగిపోతుంది. ప్రధానగా చిన్న పిల్లలైతే బాంబుల మోత లేనిదే దీపావళి సెలెబ్రేట్ చేసుకోలేరు. పెద్ద వాళ్ళు కూడా టపాసులు కాలుస్తూ..ఎంజాయ్ చేస్తుంటారు. కానీ కళ్లు మిరుమిట్లు గొలిపే టపాసులు, అధిక శబ్దంతో ఉండే క్రాకర్స్ విక్రయించే వారిపై కేసులు బుక్ చేస్తామంటోంది పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పెసో). లెడ్, లిథియం, తదితర భారలోహాలున్న టపాసుల మోత కారణంగా సమీపంలోని పెట్రోల్ బంకులకు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇలాంటి క్రాకర్స్ విక్రయించే వారిని గుట్టురట్టు చేసేందుకు పీసీబీ రంగంలోకి దిగింది. పట్టుబడితే..సదరు విక్రయదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. 

ప్రధానంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే టపాసుల్లోనే వీటి ఆనవాళ్లుంటాయని చెబుతున్నారు. ఈసారి దీపావళి పండుగను కాలుష్య రహితంగా జరుపుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దేశవాళీ టపాసులు కాల్చుకోవాలని సూచిస్తున్నారు. లెడ్, లిథియం, యాంటీమోనీ, మెర్క్యూరీ, ఆర్సినిక్ తదితర భార లోహాలతో తయారు చేసే ఫైర్స్ క్రాకర్స్, మ్యూజికల్ క్రాకర్స్, లూనార్ రాకెట్స్..ఇతరత్రా..టపాసులు పేల్చేవారికి ఆనందం కలిగించినా..దీనివల్ల పర్యావరణ హానికి కారణమౌతున్నారు. అత్యధిక ధ్వనులు వెలువడే..క్రాకర్స్ కారణంగా చెవులకు ముప్పు పొంచి ఉందని స్పష్టం చేస్తున్నారు. క్రాకర్స్ నుంచి వెలువడే పొగ ద్వారా ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులు, సిటీజన్లు స్వేచ్చగా శ్వాసించే పరిస్థితులు లేవంటున్నారు. 

దీపావళి రోజున నగర వాతావరణంలో వివిధ రకాల కాలుష్య కారకాల మోతాదు రెట్టింపు అవుతున్నట్లు పీసీబీ పరిశీలనలో తేలింది. కాలుష్యం సాధారణ రోజుల్లో 34 శాతం మేర నమోదవుతోంది. దీపావళి రోజున..61 శాతానికి పెరుగుతున్నట్లు పీసీబీ వెల్లడించింది. 
Read More : ప్రగతి భవన్ ముట్టడి చిచ్చు : రేవంత్‌పై సీనియర్ల గుస్సా

Diwali
pcb
Survey
Alert Hyderabad
Diwali Crackers

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు