కెరీర్ ఏదైనా ఓకే.. క్రీడలొద్దు : యువతకు నీషమ్ హితబోధ

Submitted on 16 July 2019
Distraught Jimmy Neesham asks kids to not take up sport after New Zealand's World Cup final heartbreak

ఫైనల్లో కప్ కోసం ఇంగ్లండ్, న్యూజిలాండ్ కొట్లాడిన తీరు ప్రతి క్రికెట్ అభిమానిని అబ్బుపరిచింది. కివీస్ ఆటగాళ్ల ప్రదర్శన అద్భుతమంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కివీస్ ఆటగాళ్లలో జేమ్స్ నీషమ్ ఆల్ రౌండర్ షో ఎంతో ఆకట్టుకుంది. నీషమ్ తన అద్భుతమైన ఆటతీరుతో ఎందరో హృదయాలను గెలుచుకున్నాడు. వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమిభారం నుంచి కివీస్ ఆటగాడు జేమ్స్ నీషమ్ ఇంకా తేరుకోలేదు. కప్ చేజారిపోయిందే బాధ అతనిలో అసహనానికి గురిచేసింది. క్రికెట్ అంటేనే విరక్తి పుట్టించేంతగా అతడి మనస్సు కకావికలమైంది. 
Also Read : ధోనీ ఫ్యూచర్ ఏంటి? : 19న వెస్టిండీస్‌‌కు టీమిండియా.. జట్టులో ఉంటాడా?

మానసిక ఒత్తిడికి గురైన అతడు తన బాధను మాటల్లో వర్ణించలేకపోయాడు. కివీస్ ఆల్ రౌండర్ జేమ్స్ నీషమ్ ట్విట్టర్ వేదికగా తన బాధను పంచుకున్నాడు. ప్రత్యేకించి.. కిడ్స్, యూత్ కు క్రికెట్ విషయంలో హితబోధ చేశాడు. ఎవరూ కూడా తమ కెరీర్ గా క్రీడలను ఎంచుకోవద్దని సూచించాడు. ‘కిడ్స్ క్రీడొల్లోకి రావొద్దు. మీకు నచ్చింది  ఏదైనా మీ కెరీర్ ఎంచుకోండి.. కానీ, క్రీడలొద్దు. 60లో హాయిగా కన్నుమూస్తే చాలు’ అంటూ తన బాధను ఇలా వెలిబుచ్చాడు. జూలై 14న లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన ఫైనల్ పోరులో కివీస్ ఆల్ రౌండర్ నీషమ్ ప్రదర్శన అభిమానులను ఎంతో ఆకట్టుకుంది.  

ప్రపంచ కప్ టోర్నీలో న్యూజిలాండ్ ప్రదర్శించిన ఆటతీరు విమర్శకులను సైతం మెప్పించింది. ప్రత్యర్థి జట్టు కూడా హ్యాట్సాప్ అంటూ కివీస్ కు సలాం కొట్టింది. అద్భుతమైన ప్రదర్శనతో అనూహ్య పరిణామాలతో పోరాడిన ఓడిన న్యూజిలాండ్ జట్టు చివరికి ప్రపంచ కప్ చేజార్చుకుంది. క్రికెట్ పుట్టినిల్లుగా పేరొందిన ఇంగ్లండ్ ఎన్నాళ్ల నుంచో పుట్టింటికి కప్ తేవాలనే కోరిక ఎట్టకేలకు నెరవేరింది. ప్రపంచ కప్ కొత్త చాంపియన్ గా నిలిచింది. 

బౌండరీలతో మ్యాచ్ ఫలితం తేలడంతో ఇంగ్లండ్ కప్ ఎగురేసుకపోయిందే తప్ప.. నిజానికి ట్రోఫీ.. న్యాయంగా కివీస్ కే దక్కాలనే భావన చాలామందిలో ఉందనే చెప్పాలి.  ఎందుకంటే.. అంత బాగా ఆడారు.. ఇంగ్లండ్ కూడా అందివచ్చిన అవకాశాన్ని చాలాబాగా వినియోగించుకుంది. అదృష్టం కలిసిరావడంతో కప్పు సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ మ్యాచ్ మొత్తంలో 17 బౌండరీలతో పోలిస్తే ఇంగ్లండ్ బౌండరీలు మొత్తం 26 ఉండటడంతో విజయం మోర్గాస్ సేననే వరించింది. 
Also Read : ప్రపంచకప్-2023 ఇండియాలోనే

Jimmy Neesham
kids
sport
new zealand
World Cup final
england
ICCRules 

మరిన్ని వార్తలు