మాకేం తెలీదు.. ఫుల్లుగా తాగున్నాం.. ఏం చేస్తున్నామో సోయి లేదు : దిశ హత్య కేసు నిందితుల సమాధానంతో పోలీసులు షాక్

Submitted on 2 December 2019
disha rape murder case accused sensational answer

వెటర్నరీ డాక్టర్ దిశ హత్య కేసు నిందితులు పోలీసులకు చెప్పిన సమాధానం కంగుతినేలా చేస్తోంది. ''ఏమో సార్‌.. అప్పుడు మేం ఫుల్లుగా తాగి ఉన్నాం. ఏం చేస్తున్నామో సోయి లేదు. పొద్దున్నుంచి ఖాళీగా లారీలో కూర్చొని విసుగు పుట్టింది. ఒంటరిగా యువతి కనిపించగానే ఏదో ఒకటి చేయాలని అనుకున్నాం'' అని నిందితులు విచారణలో వెల్లడించడంతో పోలీసులు అవాక్కయ్యారు.   

దిశ ఎంత ఆలస్యంగా వస్తే మా పని అంత సులువు అవుతుందనుకున్నామని వెల్లడించారు నిందితులు. రాత్రి 9 గంటల తర్వాతే ఆమె రావడంతో... హడావుడిగా లారీలోంచి కిందకి దిగామన్నారు. సామూహిక హత్యాచారం తర్వాత అక్కడి నుంచి పారిపోవాలనుకున్నామని మద్యం తాగుతూ నిర్ణయించుకున్నామని చెప్పారు. ఆమెను చంపేసి కాల్చేస్తే ఇంత దూరం వస్తదనుకోలేదని నిందితులు చెప్పడంతో పోలసులు కంగుతిన్నారు.  

గతంలో తాను దొంగిలించిన ఇనుప కడ్డీలను విక్రయిద్దామని.. అందుకు సాయంగా రావాలంటూ నవీన్‌, చెన్నకేశవులను ప్రధాన నిందితుడు మహ్మద్‌ పిలిచాడు. వారంతా కలిసి నవంబర్ 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు చోరీ సొత్తును విక్రయించారు. అదే రోజు రాత్రి శంషాబాద్‌ శివారులోని తొండుపల్లికి చేరుకున్నారు. అక్కడి నుంచి నవంబర్ 27వ తేదీ ఉదయం 9 గంటలకు తొండుపల్లి ఓఆర్‌ఆర్‌ కూడలికి వచ్చారు. సాయంత్రం 5.30 గంటలకు మద్యం తాగడం ప్రారంభించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నలుగురూ కలిసి ఏం చేశారన్నదే ఇప్పుడు మిస్టరీగా మారింది.

disha
Rape
murder
Hyderabad
Veterinary doctor
Shamshabad

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు