difficulties for Telugu people who come to Telangana from abroad

విదేశాల నుంచి తెలంగాణకు వచ్చినా తెలుగువారికి తప్పని తిప్పలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

విదేశాల నుంచి తెలంగాణకు వచ్చినా తెలుగువారికి తిప్పలు తప్పడం లేదు. దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుల పట్ల నిర్వహకులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. 
డబ్బులు చెల్లిస్తేనే రూములు కేటాయిస్తామని నిర్వహకులు చెబుతున్నారు. రెండు, మూడు రోజులుగా బాధితులు హాల్ లోనే పడిగాపులు గాస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. 

లాక్ డౌన్ నేపథ్యంలో విదేశాల్లో ఉన్న తెలుగు వారిని వందేభారత్ మిషన్ ద్వారా హైదరాబాద్ కు అధికారులు తరలించారు. అయితే శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా పెయిడ్ క్వారంటైన్ సెంటర్లకు పంపించారు. ప్రయాణికుల వద్ద డబ్బులు లేకపోవడంతో వారికి నిర్వహకులు గదులు కేటాయించలేదు. 

దీంతో గత రెండు రోజులుగా హాల్ లోనే బాధితులు పడిగాపులు గాస్తున్నారు. డబ్బులు చెల్లిస్తేనే గదులు కేటాయిస్తామని నిర్వహకులు తేల్చి చెప్పడంతో బాధితులు దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. తమ వద్ద డబ్బులు లేవని దుబాయ్ నుంచి వచ్చిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. 

మరో క్వారంటైన్ కేంద్రంలో ఏకంగా పోలీసులే బెదిరింపులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. డబ్బులు కట్టాలంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆడియో ద్వారా తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. 

Related Posts