అమెరికాలో 21 అంతస్తుల భవంతి బాంబులతో క్షణాల్లో కూల్చివేత

Submitted on 20 May 2019
Demolition 21 floors building with bombs in seconds

అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బెథ్లెహామ్ లో మార్టిన్‌ టవర్స్‌ అనే 21 అంతస్తుల భవంతిని బాంబులతో కూల్చేశారు యజమానులు. ఉక్కు రంగంలో ఒకప్పటి దిగ్గజ సంస్థ బెత్లెహాం స్టీల్‌ ఈ భవనాన్ని దాదాపు 47 ఏళ్ల క్రితం నిర్మించింది. అమెరికాలోనే రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి సంస్థగా పేరున్న బెథ్లెహామ్ స్టీల్‌.,.. 2003లోనే కార్యకలాపాలను నిలిపివేసింది.  

కొంతకాలంగా ఖాళీగా ఉన్న ఈ భవంతి స్థానంలో వైద్య కార్యాలయాలు, స్టోర్లు, అపార్ట్‌మెంట్లను నిర్మించనున్నారు. ఈ కారణంగానే భవంతిని కూల్చేశారు. క్షణాల్లోనే 21 అంతస్తుల మార్టిన్‌ టవర్‌ కూల్చడాన్ని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రతలివచ్చారు. భవనం కుప్పకూల్చడాన్ని స్థానికులు ఆశ్చర్యంగా తిలకించారు.
 

america
demolition
21 floors
building
Bombs
seconds

మరిన్ని వార్తలు