తబ్లిగీ సభ్యులను వేరే చోటుకి తరలించండి..భయాందోళనలో ఢిల్లీ గులాబ్ బాగ్ నివాసితులు

Submitted on 9 April 2020
Delhi's Gulabi Bagh residents protest shifting of Tablighi members to neighbouring school for quarantine

తబ్లిగీ జమాత్ సభ్యులను క్వారంటైన్ కోసం తమ పొరుగునే ఉన్న స్కూల్ నుంచి వేరొక చోటుకి తరలించాలంటూ ఢిల్లీలోని గులాబి బాగ్ ఏరియా నివాసితులు ఆందోళనకు దిగారు. తబ్లిగీ సభ్యుల వల్ల తమ ఏరియాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్వారంటైన్ సెంటర్ ను తక్కువ జనాభా ఉన్న ఏరియాకు మార్చుకోవాలంటూ ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్,సీఎం కేజ్రీవాల్ కు లేఖ రాసింది.

గులాబీ బాగ్ గవర్నమెంట్ ఫ్లాట్స్ RWA(సిటీలో అతిపెద్ద ఢిల్లీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ రెసిడెన్సియల్ కాలనీ)ప్రెసిడెంట్ సంజీవ్ భరద్వాజ్ మాట్లాడుతూ...ఈ ఏరియాలో 15వేలమంది నివాసం ఉంటున్నారు. క్వారంటైన్ సెంటర్ గా మార్చిన స్కూల్ రెసిడెన్షియల్ ఫాట్ ల మధ్యలోఉంది. ఒకవేళ తబ్లిగీ జమాత్ సభ్యులను కనుక వెంటనే వేరొక చోటుకి మార్చకపోతే,ఎసెన్షియల్ పబ్లిక్ సర్వీసెస్ లో నిమగ్నమైన ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న ఈ ఏరియా తదుపరి కరోనా హాట్ స్పాట్ గా మారుతుంది.

ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో భయం నెలకొంది. మంగళవారం ఇద్దరు తబ్లిగీ జమాత్ సభ్యులు క్వారంటైన్ సెంటర్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. కానీ వాళ్లు దొరికిపోయారు. అంతేకాకుండా ఎక్కువమంది జనాలు లేని ఏరియాకు తబ్లిగీ సభ్యులను వెంటనే తరలించాలని లెఫ్టినెంట్ గవర్నర్,సీఎం కేజ్రీవాల్ ను తాను లేఖ ద్వారా కోరినట్లు భరద్వాజ చెప్పారు.

ఢిల్లీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఉమేష్ భత్రా లెఫ్టినెంట్ గవర్నర్,సీఎం కేజ్రీవాల్ కు రాసిన లేఖలో...15వేలమంది కుటుంబసభ్యులతో కలిసి2500ఆఫీసర్లు,అధికారులు గులాబి బాగ్ ఏరియాలో నివసిస్తున్నారు. ఇక్కడ నివసిస్తున్న చాలా మంది సిబ్బంది COVID-19పై పోరాడే అత్యవసర విధుల్లో ఉన్నారన్న విషయం మరిచి ప్రస్తుతం,120 మంది తబ్లిగీ సభ్యులు ఇక్కడున్న పాఠశాలకు క్వారంటైన్ కోసం పంపబడ్డారు.

స్కూల్ చుట్టూ రెసిడెన్షియల్ ఫ్లాట్ లు ఉన్నాయి. నివాసితులు మరియు వారి కుటుంబ సభ్యుల్లో టెన్షన్ నెలకొంది. ఇద్దరు తబ్లిగీ జమాత్ సభ్యులు ఈ పాఠశాల నుండి కొద్ది రోజుల క్రితం తప్పించుకోవడానికి ప్రయత్నించారు అని బాత్రా చెప్పారు.(ప్రాణం తీసిన లాక్ డౌన్, భార్య ఎడబాటు తట్టుకోలేక భర్త ఆత్మహత్య)

ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ బిల్డింగ్ లో గత నెలలో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరై అదే బిల్డింగ్ లో ఉండిపోయిన 2,340మందిని ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం క్వారంటైన్ కు తరలించిన విషయం తెలిసిందే. దేశంలో సగం కరోనా కేసులు నిజాముద్దీన్ మర్కజ్ కార్యక్రమానికి హాజరైన వారివే.

Delhi
GULAB BAGH
ARA
TABLIGI MEMBERS
Protest
school
QUARANTINE
NIGHBOURING
flats
CM
LT
Letter
Govt Employees
covid19
coronavirus

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు