పంత్ పటాకా, హైదరాబాద్ ఇక ఇంటికే

Submitted on 8 May 2019
Delhi won by 2 wickets

ఢిల్లీ పోరాటం ఫలించింది. హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. 163 పరుగుల లక్ష్యాన్ని సాధించేందుకు పృథ్వీ... పంత్ మెరుపులు కురిపించారు. 

ఓపెన‌ర్ షా (56; 38 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సులు) శుభారంభాన్ని న‌మోదు చేయ‌డంతో చేధ‌న సులువైంది. ధావ‌న్(17), శ్రేయాస్ అయ్య‌ర్(8)స్వ‌ల్ప విరామానికే అవుట్ అయ్యారు. ఆ త‌ర్వాత పంత్(49; 21 బంతుల్లో 2ఫోర్లు, 5సిక్సులు)వీరోచిత పోరాటానికి విజ‌యం సుసాధ్య‌మైంది. గేమ్ చివ‌ర్లో ఉండ‌గా పంత్ అవుట్ అవ‌డంతో ఢిల్లీ విజ‌యం సందేహంగా మారింది. ఆ స‌మ‌యంలో బౌల‌ర్లే మ్యాచ్‌ను ముగించేశారు. 

ఫైన‌ల్ లో త‌ల‌ప‌డేందుకు ఢిల్లీ మ‌రో మ్యాచ్ గెల‌వాల్సి ఉంది. మ‌హేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో ఆడ‌నున్న సూప‌ర్ కింగ్స్‌ను ఓడిస్తేనే కానీ సాధ్య‌ప‌డ‌దు. మే10న వైజాగ్ వేదిక‌గా ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.
 

మ‌న్రో(14), అక్స‌ర్(0), కీమోపాల్(5), రూథ‌ర్ ఫ‌ర్డ్(9), మిశ్రా(1), బౌల్ట్(0)ప‌రుగులు చేయ‌గ‌లిగారు. హైద‌రాబాద్ బౌల‌ర్లు భువ‌నేశ్వ‌ర్, ఖలీల్ అహ్మ‌ద్, ర‌షీద్ ఖాన్ త‌లో 2వికెట్లు తీయ‌గా దీప‌క్ హుడా 1వికెట్ ద‌క్కించుకున్నాడు. 

అంత‌కంటే ముందు టాస్ ఓడి టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైద‌రాబాద్ స‌త్తా చాటింది. వైజాగ్ వేదిక‌గా జ‌రుగుతోన్న ఎలిమినేట‌ర్ మ్యాచ్ లో నిర్ణీత‌ 8వికెట్లు న‌ష్ట‌పోయి ఢిల్లీకి 163 ప‌రుగుల టార్గెట్ నిర్దేశించింది. స‌న్‌రైజ‌ర్స్ ఓపెన‌ర్ సాహా(8) వికెట్ కోల్పోయిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత బ్యాట్స్‌మెన్  మార్టిన్ గ‌ఫ్తిల్(36; 19బంతుల్లో 1ఫోర్, 4సిక్సులు), మ‌నీశ్ పాండే(30)తొ వికెట్ల ప‌త‌నానికి కాసేపు విరామ‌మిచ్చారు. 

కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్(28), విజ‌య్ శంక‌ర్(25), మొహ‌మ్మ‌ద్ న‌బీ(20), దీప‌క్ హుడా(4), ర‌షీద్ ఖాన్(0), భువ‌నేశ్వ‌ర్ కుమార్(0), బ‌సిల్ థంపీ(1)లు నామ‌మాత్ర‌మైన స్కోరు న‌మోదు చేయ‌డంతో 162ప‌రుగులు చేయ‌గ‌లిగారు. 

ఢిల్లీ బౌల‌ర్లు ఇషాంత్ శ‌ర్మ‌(2), ట్రెంట్ బౌల్ట్(1), అమిత్ మిశ్రా(1), కీమో పాల్(3)వికెట్లు తీయ‌గ‌లిగారు. 

dc
srh
IPL
IPL 2019
delhi capitals
sunrises hyderabad

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు