పేద కళాకారులకు ‘డిగ్రీ కాలేజ్’ హీరో వరుణ్ సాయం

Submitted on 9 April 2020
Degree College Movie Hero Varun Distributing Groceries To Junior Artists

క‌రోనా మ‌హ్మ‌మారి రోజురోజుకి విజృభిస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా నివార‌ణ‌కు అన్ని దేశ ప్ర‌భుత్వాలు, ప్ర‌జ‌లు త‌గు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా క‌రోనా ప్ర‌భావం తీవ్రంగా నెల‌కొంది. అంతే ధీటుగా తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు సైతం నివార‌ణ కార్య‌క్ర‌మాలు చేస్తున్నాయి. ప్ర‌‌భుత్వం తీసుకుంటున్న నివార‌ణ చ‌ర్య‌ల‌కు మ‌ద్ధ‌త్తుగా ప‌లువురు పారిశ్రామికవేత్త‌లు, సినీ ప్ర‌ముఖులు భారీ ఎత్తున ఆర్ధిక స‌హకారం అందిస్తున్నారు.

Degree College Movie Hero Varun Distributing Groceries To Junior Artists

Read Also : బాక్సాఫీస్ బ్రేక్‌‌డౌన్.. పైరసీ కంటే డేంజర్ కరోనా.. టాలీవుడ్‌పై లాక్‌డౌన్ ఎఫెక్ట్ ఎంత వరకు?.. నిర్మాత సురేష్ బాబు స్పందన..

ఈ నేప‌థ్యంలో ‘డిగ్రీ కాలేజీ’ హీరో వరుణ్ ఈరోజు (ఏప్రిల్ 9న) అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర 100 మంది ఆర్టిస్టులకు నిత్యావసరాలు సరఫరా చేశారు. ఈ సందర్భంగా హీరో వరుణ్ మాట్లాడుతూ...‘నా పుట్టినరోజు సందర్భంగా ఇటీవల కొందరు ఆర్టిస్ట్స్‌కు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇటీవల కేసీఆర్ గారి స్పీచ్ విన్నాను, రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉందన్నారు, అందుచేత  మరోసారి అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర యూనియన్ కార్డ్‌లేని వంద మంది ఆర్టిస్టులకు బియ్యం, ధాన్యాలు వంటి పలు నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది.

​​Degree College Movie Hero Varun Distributing Groceries To Junior Artists

విష్యత్తులో ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చెయ్యబోతున్నాను. కరోనా ఎఫెక్ట్ కారణంగా ఉపాధి కోల్పోయిన ఆర్టిస్టులకు ఇలా సహాయం చేయడం సంతోషంగా ఉంది. కృష్ణా నగర్ ఏరియాలో అన్నపూర్ణ క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి మా అంకుల్ వి.ప్రకాష్ (వాటర్ రిసోర్స్ అండ్ ఇరిగేషన్ ఛైర్మెన్) ద్వారా కేసీఆర్ గారికి చెప్పిస్తున్నానని తెలిపారు.

 

coronavirus
Covid-19
LOCKDOWN
Degree College
Varun
Distributing
groceries
Junior Artists

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు