సన్‌రైజర్స్‌తో బంధం మాటల్లో చెప్పలేను: వార్నర్

Submitted on 30 April 2019
david warner heart melting message to srh

ఐపీఎల్ 2019లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై భారీ తేడాతో గెలుపొందింది. హైదరాబాద్ గెలవడానికి డేవిడ్ వార్నర్ మరోసారి కారణమైయ్యాడు. సోమవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఎనిమిదో హాఫ్ సెంచరీ నమోదు చేసుకోకపోవడంతో పాటు అద్భుతమైన స్కోరు అందించి గుండెలు కరిగిపోయే మెసేజ్‌తో వీడ్కోలు తెలిపాడు. 

'సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉన్న బంధం మాటల్లో చెప్పలేను. కుటుంబంలా నన్ను ఆదరించారు. ఈ ఒక్క సీజన్‌కే కాదు గతేడాది కూడా మీరు చూపించిన ప్రోత్సాహం మరువలేనిది. మీ అందరిని కలవడానికి చాలా కాలం ఎదురుచూశాను. మళ్లీ నన్ను ఇంతబాగా రిసీవ్ చేసుకున్నందుకు యజమానులు, సిబ్బంది, ప్లేయర్లు, సోషల్ మీడియా టీం, అభిమానులు అందరికీ థ్యాంక్యూ వెరీ మచ్. ఇక్కడ ఆడి నేను చాలా ఎంజాయ్ చేశాను. మిగిలిన టోర్నమెంట్‌లో ప్లేయర్లు బాగా రాణించాలని ఆశిస్తున్నా' అని వార్నర్ ముగించాడు.
Also Read : నేను మగాడినే నమ్మండి... ఆస్ట్రేలియా క్రికెటర్ ఆవేదన

ఈ సీజన్ మొత్తంలో 12 మ్యాచ్‌లు ఆడిన వార్నర్ ఒక సెంచరీ, 8హాఫ్ సెంచరీలతో కలిపి 692పరుగులు చేశాడు. లీగ్‌లో చివరి మ్యాచ్ ప్రదర్శన గురించి డేవిడ్ వార్నర్ భార్య కాండిస్ వార్నర్ ట్విట్టర్ ద్వారా ఇలా స్పందించారు. 'ఐపీఎల్ సీజన్‌ను అద్భుతంగా ముగించావు. నిన్ను చూసి మేమంతా గర్విస్తున్నాం. నీ పనిలో నిబద్దత, ఓటమిని ఒప్పుకోని మనస్తత్వం మాకెంతో ప్రోత్సాహాన్నిస్తాయి. ఉయ్ లవ్యూ' అని ప్రశంసించారు. 

david warner
srh
sunrisers hyderabad

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు