టీ షర్ట్ వేసుకుందని ‘పరువు’హత్య 

Submitted on 15 April 2019
daughter Honor killing..sister 'saw parents kill her sibling' by a t shirt in UK

‘పరువు’ హత్యలు..ఆచారాల కోసం ప్రాణాల్ని చూసే దారుణ దురాచారం.‘పరువు’ సాగుతున్న ఈ మారణకాండ సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. ఇంటి పరువు కోసం స్వేచ్ఛకు భంగం కలిగించడం నేరం...దారుణం..అరాకం..అనాగరికం..‘పరువు’పేరిట సాగుతున్న ఈ హత్యలకు భారతదేశాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ దారుణాలకు అభం శుభం తెలియని ఓ యువతి బలైపోయింది. ఈ ఘటన జరిగింది బ్రిటన్ లో స్ధిరపడిన ఓ పాకిస్థానీ కుటుంబంలో. 

షఫిలియా(2003 నాటికి 17 సంవత్సరాలు) అనే యువతి తన తల్లిదండ్రులతో కలిసి యూకేలోని వారింగ్టన్‌లో నివసించేవారు. యూకేలో టీషర్ట్ వేసుకుని తిరగడం సహజం. షఫిలియా కూడా తనకు నచ్చినట్టు ఉండాలనుకుంది. దాన్ని కన్నవారు వద్దన్నారు. పాకిస్తాన్‌లోని సంప్రదాయాల ప్రకారమే ఉండాలనీ..అడ్వకేట్ అవుదామనికలలు కన్న  షఫిలియాపై పెళ్లి చేసుకోవాలని బలవంతపెట్టారు. ఆమె బైటకు వెళ్లకుండా ఇల్లునే  జైలుగా మార్చేశారు. 

అయినా సరే షఫిలియా మాత్రం తనకు నచ్చినట్లే ఉండాలనుకుంది. అలా ఓ రోజు టీషర్ట్ వేసుకున్న ఆమెపై తల్లి ఇంతెత్తున లేచింది. పెద్ద రాద్దాంతం చేసింది. దానికి తండ్రి వంత పాడాడు. షఫిలియాను చంపేయాలని నిర్ణయించుకున్నవారిద్దరూ..ఆమె నోట్లో ప్లాస్టిక్ బ్యాగును పెట్టి.. ముక్కు మూసేసి ఊపిరాడకుండా చేసి చంపేశారు. 
Read Also : కోటిపై చర్యలు తీసుకోండి : డీజీపీకి లక్ష్మీపార్వతి ఫిర్యాదు

షఫిలియాకు మరో ముగ్గురు చెల్లెల్లు, ఒక తమ్ముడు ఉన్నారు.  తాము చెప్పినట్టు నడుచుకోకుంటే షఫిలియాను చంపినట్టు ఎవరికైనా చెప్పినా చంపేస్తామంటూ హెచ్చరించారు. దీంతో భయపడిపోయిన వారంతా గప్ చుప్ గా ఉండిపోయారు. కానీ నిజం నిప్పులాంటిది.  ఎప్పటికైనా బైటపడక మానదు. ఈ క్రమంలో ఏడేళ్ల తర్వాత షఫిలియా చెల్లెలు ఆలేషా ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు అసలు విషయాన్ని బైటపెట్టింది. అప్పటి వరకూ షఫిలియాను తల్లిదండ్రులే చంపినట్లు ప్రపంచానికి తెలియదు. 

షఫిలియా మరణించే ముందు ఎంతో నరకయాతన అనుభవించిందని ఆలేషా ఏడుస్తు చెప్పింది. తన అక్క శవాన్ని కనిపించకుండా దూరంగా ఉన్న నదిలో పడేసి.. కనిపించడం లేదంటూ తల్లిదండ్రులే నాటకం ఆడారని..4 నెలల తరువాత శవం దొరికితే అంత్యక్రియలు చేశారని  ఆలేషా తెలిపింది. షఫిలియా తల్లిదండ్రులను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా.. కోర్టు వారికి 25 ఏళ్ల జైలు శిక్షను విధించింది.
Read Also : వరల్డ్ కప్ భారత జట్టు బలాబలాలు

UK
Shuffila
Honor Killing
Tea Shirt
25 years
Jail

మరిన్ని వార్తలు