హెల్త్ టిప్స్: రోజు ఎక్సర్‌సైజ్ కి ముందు వీటిని తీసుకుంటే మంచిది

Submitted on 13 May 2019
Daily You Can Eat These Food Before Doing Excercise

ఫిట్‌గా ఉండాలంటే ఉదయాన్నే లేచి ఎక్సర్‌సైజ్ చేస్తుండాలి. కేవలం ఫిట్‌గానేకాదు.. ఆరోగ్యంగా ఉండాలన్నా ఎక్సర్‌సైజ్ చేయాలి. అయితే రోజూ చేయడం ముఖ్యం కాదు చేస్తున్న ఎక్సర్‌సైజ్ ఎంతబాగా చేస్తున్నామన్నదే ముఖ్యం. అదేవిధంగా ఎక్కువసేపు చేయడానికి ప్రయత్నించాలి. అలా చేయాలంటే అందుకు సరిపోయే శక్తి మనశరీరంలో ఉండాలి. శక్తి ఉండాలంటే అందుకు సరిపోయే ఆహారం తీసుకోవాలి. కాబట్టి ఎక్సర్‌సైజ్ చేసే 30 నిమిషాల ముందు ఒక అరటిపండు లేదా ఖర్జూరాలు  తినాలి. దీంతో ఎంతసేపు చేసినా అలసట రాదు.

అంతేకాదు వ్యాయామం అయిపోయాక మరో 30 నిమిషాలు గ్యాప్ ఇచ్చి అరటిపండు, మిల్క్ షేక్, బాదం, అక్రోట్స్, స్ప్రౌట్స్ లాంటివి తీసుకుంటే మంచిది. నీరు కూడా ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడే శరీరం నుంచి చెమట రూపంలో పోయిన నీటిని భర్తీ చేయొచ్చు.  

Excercise
Early Morning
Food To Eat
health tips

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు