సైకిల్ ప్రేమకథ వచ్చేస్తోంది

Submitted on 10 July 2019
Cycle Love Story Coming Soon In Theaters

ఆట్ల అర్జున్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో పునర్ణవి భూపాలం, మహత్ రాఘవేంద్ర శ్వేతావర్మ, సూర్య లీడ్ రోల్స్ లో తెరకెక్కిన సినిమా సైకిల్. గ్రే మీడియా బ్యానర్ పై, ఓవ‌ర‌సీస్ నెట్‌వ‌ర్క్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ విజ‌యా ఫిలింస్‌, ఓంశ్రీ మ‌ణికంఠా ఫిలింస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం. షూటింగ్‌తో పాటు డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు కూడా పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా దర్శకుడు అర్జున్ రెడ్డీ మాట్లాడుతూ...ఇండియ‌న్ సినిమాలో ఇంకా చెప్ప‌టానికేం లేవు అన్ని రకాల క‌థ‌ల‌తో సినిమాలు వచ్చాయి. అయినా కొత్త క‌థ‌లు రాస్తున్నాం కొత్త సినిమాలు తీస్తున్నాం. మా మూవీకి సైకిల్ పేరుని టైటిల్‌గా పెట్టుకుని ఫ‌స్ట్ సీన్‌లోనే దానికి సంబంధించిన ఇంట్ర‌స్టింగ్ లింక్‌తో క్లీన్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ తీశాము. 

ఈ సినిమాలో సూర్య‌, మ‌ధుమ‌ణి న‌వీన్‌నేని, ఆర్ఎక్స్‌100 ల‌క్ష్మ‌ణ్‌, అన్న‌పూర్ణ‌మ్మ జోగీబ్ర‌ద‌ర్స్ కూడా చాలా ఎంట‌ర్‌టైన్ చేస్తారు. త్వ‌ర‌లో టీజ‌ర్‌తోపాటు, ఆడియో రిలీజ్ చేసుకుని ధియేట‌ర్స్‌లోకి రాబోతుంది. ఈ సినిమాకి నిర్మాత‌లు పి.రాంప్ర‌సాద్‌, డి.న‌వీన్‌రెడ్డి. జి.ఎం.స‌తీష్ సంగీతం అందిస్తున్నారు.

cycle
love story
coming soon
Theaters


మరిన్ని వార్తలు