‘కట్ చేస్తే’ - ఆలోచింపచేస్తున్న షార్ట్ ఫిలిం..

Submitted on 22 October 2019
Cut Chesthe - Telugu short film

యువతరం ఆలోచనలు, వారి క్రియేటివిటీ కొత్త పుంతలు తొక్కుతున్న రోజులివి.. యాక్టింగ్, సింగింగ్, మ్యూజిక్, డ్యాన్సింగ్, ఫోటోగ్రఫీ, డైరెక్షన్.. ఇలా తమకు నచ్చిన ఏ రంగంలోనైనా టాలెంట్ చూపించి, ప్రేక్షకులను ఆకట్టుకుని, తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలనుకునేవారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారు తీసుకునే ఫస్ట్ స్టెప్.. షార్ట్ ఫిలింస్..

లవ్, కామెడీ వంటివి అందరూ చేసే కథలే.. కొత్తగా ఏదైనా చేయాలి, అది సమాజానికి సందేశంలా ఉండాలి, దాని ద్వారా మన క్రియేటివిటీ బయట పడాలి, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి అనే ఆలోచనతో ఉమా మహేష్ అనే కుర్రాడు కొందరు కుర్రాళ్లతో కలిసి ‘కట్ చేస్తే’ అనే షార్ట్ ఫిలిం రూపొందించాడు. సమాజంలో అందరూ ఫేస్ చేస్తున్న ఒక ప్రాబ్లమ్.. బైక్ సైడ్ స్టాండ్.. ‘నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి కాకూడదు’ అనే కాన్సెప్ట్‌ ఎంచుకున్నాడు..

Read Also : ఆకట్టుకుంటున్న ‘సింగిడిలో బతుకమ్మ’ పాట

మొదట్లో దొంగతనమేదో జరుగబోతుందనే హింట్ ఇచ్చినట్టు ఇచ్చి, చివరి వరకూ సస్పెన్స్ మెయింటెన్ చేస్తూ.. అప్పటి వరకూ అతణ్ణి వెంబడించింది బైక్ స్టాండ్ తీయమని చెప్పడానికే అని రివీల్ చేస్తూ.. డైరెక్టర్ ఊపిరి పీల్చుకోనిచ్చాడు.. సేమ్ టైమ్ ఆలోచింపచేశాడు.. కాన్సెప్ట్ పరంగా చెప్పాలంటే సింపుల్.. కానీ, టేకింగ్‌తో, ఎటువంటి డైలాగులు లేకుండా తను చెప్పాలనుకున్నది సూటిగా సుత్తి లేకుండా చెప్పాడు.. వ్యూయర్స్‌ని ఆకట్టుకున్నాడు.. 


నిజాలు, నీతులు, జాగ్రత్తలు చెప్పే పద్ధతిలో చెప్తేనే వింటారు.. అనేలా చక్కటి మెసేజ్‌తో అలరించిన డైరెక్టర్ ఉమా మహేష్ సినీ రంగంలో ప్రవేశించి తన కలను నెరవేర్చుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అతని ప్రయత్నాలు ఫలించి, తన మేధస్సుతో తెలుగు ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటూ.. ఆల్ ది బెస్ట్.. 
వాచ్ ‘కట్ చేస్తే’ షార్ట్ ఫిలిం.. 

 

Cut Chesthe
vinod kumar .d
Chandi srinivas .M. uma mahesh.m

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు