పట్టుకో..పట్టుకో :రోడ్డుపై కరెన్సీ నోట్ల వర్షం!!

Submitted on 11 July 2019
Currency notes on the road on America Georgia Highway

రోడ్ల నిండా కరెన్సీ నోట్లు! గాల్లో ఎగురుకుంటు వస్తున్న కరెన్సీ కట్టలు!!. అప్పుడు ఏం చేస్తాం..ఇక ఒక్కటంటే ఒక్క క్షణం కూడా ఆలోచించేది లేదు. గబాగబా ఏరేసుకుంటాం. ఎవ్వరైనా అదే చేస్తారు. రోడ్డుపై నడుచుకుంటు వెళ్తుంటే అటుగా వెళ్తున్న ఓ కంటైనర్ నుంచీ కిందపడిన కరెన్సీ నోట్లు గాల్లో ఎగిరాయి. అదే జరిగింది అమెరికాలోని జార్జియా హైవే పై. అంతే..అక్కడ సీన్ మారిపోయింది. 
 

జార్జియాలోని ఓ  హైవే ఆయుధాలు, కరెన్సీ కట్టలతో వెళ్తోంది ఓ ట్రక్. గాలి బలంగా వీస్తోంది. ట్రక్ డోర్ ఓపెన్ అయ్యింది. అంతే కరెన్సీ నోట్లు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరాయి. చూస్తుండగానే ఆ రోడ్డంతా కరెన్సీ నోట్ల వర్షం కురిసింది. ఆ రోడ్డుపై వెళ్తున్న వాహనదారులంతా ఎక్కడివక్కడ ఆపేసి నోట్లు ఏరుకోవటంలో బిజీ అయిపోయారు.

నోట్లను పట్టుకునేందుకు పరుగులు పెట్టారు. వాటిని దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. ఓవైపు వాళ్లు నోట్లను ఏరుకుంటుంటే... మరోవైపు గాలికి ఆ నోట్లు అలా అలా చుట్టుపక్కల గడ్డి మైదానాల్లోకి వెళ్లిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసినవారు అబ్బా..డబ్బుల వర్షంలా కురుస్తున్న ప్లేస్ లో మనం కూడా ఉంటే ఎంత బాగుండేది అనుకోకుండా ఉండలేరు కదూ.

america
Georgia
Highway
currency notes
Road


మరిన్ని వార్తలు