డ్యూటీతో గేమ్స్ వద్దు : CRPF జవాన్ల ఫోన్లలో PUBG బ్యాన్

Submitted on 15 May 2019
http://www.10tv.in/crpf-jawans-banned-playing-pubg-duty-hours-12194

పబ్ జీ.. ఇండియాలో పాపులర్ వీడియో గేమ్.. ఒకసారి ఆడితే చాలు.. ఎవరైనా అడిక్ట్ అయిపోవాల్సిందే. ప్లేయర్ అన్ నౌన్ బాటిల్ గ్రౌండ్స్ (PUBG)వీడియో గేమ్ కు బానిసైన చాలామంది యూత్ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చదువు మానేసి పిల్లలు పబ్ జీ జపం చేస్తున్నారు. ఇప్పటికే దేశంలో పబ్ జీ గేమ్ ను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ లు వెల్లువెత్తాయి. పిల్లలు, యూత్ ను మాత్రమే పట్టిపీడుస్తున్న ఈ పబ్ జీ గేమ్.. సరిహద్దుల వరకు పాకింది.
Also Read : కాలాంతకులు : వెయ్యి రూపాయల సాఫ్ట్‌వేర్ తో వాట్సాప్‌ కే బురిడీ!

పబ్ జీ మాయలో జవాన్లు :
దేశ సరిహద్దుల్లోని జవాన్లు సైతం పబ్ జీ మాయలో పడిపోయారు. సీఆర్ పీఎఫ్ జవాన్లు సైతం గేమ్ కు అడిక్ట్ అయి.. డ్యూటీలో తమ స్మార్ట్ ఫోన్లలో పబ్ జీ గేమ్ ఆడుతున్నారట. సరిహద్దుల్లో ఎప్పటికప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిన జవాన్లలో కార్యాచరణ సామర్థ్యాలు సన్నగిల్లుతున్నాయనే ఉద్దేశంతో వారి స్మార్ట్ ఫోన్లలో పబ్ జీ గేమ్ బ్యాన్ చేశారు. జవాన్ల ఫోన్లలో పబ్ జీ వీడియో గేమ్ ను తక్షణమే డిలీట్ చేయాల్సిందిగా ఇండియన్ ఆర్మీ అధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఢిల్లీలోని ఓ సీనియర్ CRPF అధికారి మాట్లాడుతూ.. సీఆర్పీఎఫ్ జవాన్లను పబ్ జీ ఆడకుండా బ్యాన్ చేసినట్టు తెలిపారు. పబ్ జీ గేమ్ కారణంగా జవాన్ల ఆపరేషనల్ కేపబిలిటీస్ పై ప్రభావం చూపుతోందని చెప్పారు. 

గేమ్ డిలీట్ చేయండి : ఆర్మీ ఆదేశాలు 
అంతేకాదు.. పబ్ జీ గేమ్ పై ఆసక్తి పెరగడంతో.. డ్యూటీ సమయంలో నిద్రలేమితో జవాన్లు బాధపడుతున్నట్టు తమ దృష్టికి వచ్చినట్టు తెలిపారు. గంటల తరబడి పబ్ జీ గేమ్ ఆడటంతో ఫిజికల్ యాక్టివిటీ కూడా జవాన్లలో తగ్గిపోతుందని, అందుకే ఈ దిశగా చర్యలు చేపట్టినట్టు చెప్పారు. అన్ని డిప్యూటీ ఇన్స్ పెక్టర్లు-జనరల్స్..   సీఆర్ పీఎఫ్ జవాన్ల అందరి స్మార్ట్ ఫోన్లలో నుంచి పబ్ జీ గేమ్ ను వెంటనే డిలీట్ చేయాల్సిందిగా ఆదేశించినట్టు తెలిపారు.

ఇక నుంచి ప్రతి CRPF జవాన్ స్మార్ట్ ఫోన్లను కంపెనీ కమాండర్లు తనిఖీలు చేసేలా ఆదేశాలు జారీ అయ్యాయి. ఇండియాలో పబ్ జీ వీడియో గేమ్ ను బ్యాన్ చేయడం ఇది తొలిసారి కాదు..2019 జనవరిలో గుజరాత్ ప్రభుత్వం అధికారికంగా పబ్ జీ ని బ్యాన్ చేసింది. ప్రైమరీ స్కూళ్లలోని విద్యార్థులు పబ్ జీ గేమ్ కారణంగా వారి చదువు పాడైపోతుందని, మానసిక స్థితి దెబ్బతింటోందని కారణంతో రాష్ట్ర ప్రభుత్వం పబ్ జీ గేమ్ బ్యాన్ చేసింది. పబ్ జీ బ్యాన్ చేసిన దేశాల్లో ఒక్క ఇండియానే కాదు.. నేపాల్, ఇరాక్ ప్రభుత్వాలు కూడా తమదేశంలో పబ్ జీ గేమ్ ను బ్యాన్ చేశాయి.  
Also Read : అందుకే సెలక్ట్ చేశాం : దినేశ్ కార్తీక్ ఎంపికపై కోహ్లీ చెప్పిన కారణం ఇదే

Duty Hours
CRPF Jawans
Company commanders
PUBG addiction
security forces 

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు