టిక్‌టాక్, ట్విటర్, వాట్సప్ పై క్రిమినల్ కేసులు

Submitted on 27 February 2020
Criminal Cases on Ticktack, Twitter, WhatsApp

దేశంలోనే తొలిసారిగా టిక్‌టాక్, ట్విటర్, వాట్సప్ యాజమాన్యాలపై కేసులు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. దేశానికి వ్యతిరేకంగా మత పరమైన వీడియోలు ఉద్దేశ పూర్వకంగా వైరల్ చేస్తున్నారని సీనియర్ జర్నలిస్ట్ ఎస్‌. శ్రీశైలం దాఖలు చేసిన పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ తరువాత నాంపల్లి కోర్టు కీలక నిర్ణయం వెల్లడించింది. 

ఇండియన్ టిక్ టాక్, వాట్సప్ గ్రూప్ ల్లో పాకిస్థాన్ కు చెందిన వారు ఉన్నారని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీని వ్యతిరేకిస్తున్న వీడియోలు పాకిస్తాన్ వారు పెడితే, ఇండియాలో పెట్టినట్లు వైరల్ చేస్తున్నారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. పిటిషనర్ ఆధారాలు పరిగణనలోకి తీసుకొని తగిన చర్యలు చేపట్టాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు నాంపల్లి కోర్టు సూచించింది. 

రెండు రోజుల్లో టిక్ టాక్, ట్విట్టర్, వాట్సప్ యాజమాన్యాలకు సైబర్ క్రైమ్ పోలుసులు నోటీసులు ఇవ్వనున్నారు. యాప్ యాజమాన్యాలపై 153 (A) , 121 (A) ,294, 505, రెడ్ విత్ 156(3) కింద కేసులు నమోదు చేశారు. 
 

Criminal cases
Ticktack
Twitter
WhatsApp
nampally court
Hyderabad

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు