క్రికెట్ లవర్స్ కి షాక్ : క్రీడగా గుర్తించని ప్రభుత్వం

Submitted on 20 July 2019
Cricket isn't a sport, says Russian government

క్రికెట్ లవర్స్ కి రష్యా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. క్రికెట్ ని క్రీడగా గుర్తించేందుకు ఆ దేశ ప్రభుత్వం నిరాకరించింది. అధికారిక గుర్తింపు కలిగిన క్రీడల జాబితాలో క్రికెట్‌ను చేర్చేందుకు రష్యా క్రీడల మంత్రిత్వ శాఖ నో చెప్పింది. క్రికెట్ వరల్డ్ కప్ 2019 ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాతి రోజు.. అంటే జూలై 15వ తేదీన ఈ నిర్ణయం వెలువడింది. రష్యాలో అధికారికంగా గుర్తింపు పొందిన క్రీడల జాబితాలో ఫుట్‌బాల్, ఐస్ హాకీ, వాలీబాల్ వంటి క్రీడలతో పాటు గోళీల ఆటలాంటి పెటాన్క్, మినీ గోల్ఫ్ వంటివి కూడా ఉన్నాయి. అధికారిక క్రీడల జాబితాలో చేర్చనంత మాత్రాన రష్యాలో క్రికెట్‌ ఆడటం నిషేధం అని కాదు. కానీ ప్రభుత్వం నుంచి క్రికెట్‌కు, క్రికెట్ ఆడే వారికీ ఎలాంటి ప్రోత్సాహం, నిధులు లభించవు. ఒక క్రికెట్ నే కాదు.. థాయ్ బాక్సింగ్‌గా పేరొందిన ముయ్ థాయ్‌ను కూడా రష్యా ప్రభుత్వం క్రీడగా గుర్తించలేదు. 

మంత్రిత్వ శాఖ రిజిస్టర్‌లో క్రికెట్‌ను కూడా చేర్చాలని ప్రయత్నించామని, దరఖాస్తులో లోపాల కారణంగా తిరస్కరించారని మాస్కో క్రికెట్ స్పోర్ట్స్ ఫెడరేషన్ సభ్యుడు అలెగ్జాండర్ సోరోకిన్ తెలిపారు. క్రికెట్‌కు ప్రభుత్వ గుర్తింపు కోసం 2020లోనూ దరఖాస్తు చేస్తామన్నారు. ఈసారి కచ్చితంగా విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

క్రికెట్ 16వ శతాబ్ధంలో ఇంగ్లండ్‌లో పుట్టిందని చెబుతారు. బ్రిటిష్ రాజ్యం అధికారంలో ఉన్న ప్రాంతాల్లో ఈ ఆట పాపులర్ అయ్యింది. 19వ శతాబ్ధం నుంచి అంతర్జాతీయ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. 1900 సమ్మర్ ఒలంపిక్స్‌లో క్రికెట్ భాగమైంది. రష్యాకు 2017లో అసోసియేట్ మెంబర్ హోదాను ఐసీపీ ఇచ్చింది. దీంతో ఐసీసీ నిర్వహించే ఈవెంట్లలో పాల్గొనే అవకాశం రష్యా క్రికెట్ జట్టుకు లభించింది. రష్యా క్రికెట్ జట్టు 2007 నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతోంది. క్రికెట్‌ను రష్యా ప్రభుత్వం క్రీడగా గుర్తించలేదన్న వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. క్రికెట్ ను అభిమానించే వాళ్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇది మరీ టూ మచ్ అని వాపోతున్నారు.

Cricket isn't a sport, says Russian government

cricket
not sport
Russian government
official
recognise
financial support

మరిన్ని వార్తలు