సౌదీ రాయల్ ఫ్యామిలీలో 150మందికి కరోనా వైరస్

Submitted on 9 April 2020
COVID-19 reaches Saudi royal family, 150 royals infected

ఇప్పటికే వివిధ దేశాల్లోని రాయల్ ఫ్యామిలీలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ లిస్ట్ లో సౌదీ అరేబియన్ రాయల్ ఫ్యామిలీ కూడా చేరింది. సౌదీ అరేబియన్ రాయల్ ఫ్యామిలీకి చెందిన 150మందికి కరోనా సోకింది. లేటెస్ట్ రిపోర్టుల ప్రకారం...సౌదీ అరేబియన్ రాజు సల్మాన్ కూడా ఐసొలేషన్ లో ఉంచబడ్డట్లు తెలుస్తోంది.

సౌదీ ప్రిన్స్ ఫైజల్ బిన్ అబ్దులజీజ్ అల్ సౌద్ ప్రస్తుతం కరోనా సోకి ఐసీయూలో ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ కూడా అదేవిధంగా ఐసొలేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియాలో ఇప్పటివరకు 2,932మందికి కరోనా సోకగా,41మంది చనిపోయారు. 631మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా ఇప్పటికే బ్రిటన్ రాయల్ ఫ్యామిలీకి,స్పెయిన్ రాయల్ ఫ్యామిలీకి కరోనా సోకిన విషయం తెలిసిందే.

covid19
coronavirus
INFECTED
royal family
Saudi Arabia
Reaches
isolation
Salman
KING
crown prince

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు