మూడు రోజుల క్రితం లవ్ మ్యారేజ్ : ఇంతలోనే సూసైడ్

Submitted on 18 February 2020
couples sucide attempt at bhongir

యాదాద్రి జిల్లా భువనగిరిలో ఆత్మహత్య చేసుకున్న నవ దంపతుల్లో చికిత్స పొందుతున్న మహిళ మంగళవారం కన్ను మూసింది.  వలిగొండ మండలం  జంగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన ఉమ,స్వామి 3 రోజుల క్రితం ఇంటి నుంచి పారిపోయి వచ్చి ప్రేమ వివాహం చేసుకున్నారు.  

అనంతరం భువనగిరిలోని ఒక లాడ్జిలో దిగారు. కారణాలు తెలియ రాలేదు కానీ  పురగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు. కడుపులో మంట తాళలేక  గట్టిగా అవరడంతో, తలుపులు పగల గొట్టి  హోటల్ సిబ్బంది వారిని ఆస్పత్రికి తరలించారు.  

భువనగిరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త స్వామి మృతి చెందాడు. మెరుగైన చికిత్స కోసం భార్య ఉమను సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది.  ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

 

Couples
Sucide Attempt
nalgonda
bhonagir
Telangana

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు