coronavirus-positive-tea-selling-person-krishna-district

టీ అమ్మే వ్యక్తికి కరోనా పాజిటివ్.. వైఎస్సార్ కాలనీలో టెన్షన్!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కృష్ణా జిల్లా జక్కంపూడిలోని వైఎస్సార్ కాలనీలో టీ విక్రయించే వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కార్మిక నగర్, ఆటో నగర్ లో టీ విక్రయించినట్లు గుర్తించారు. అతనితో కాంటాక్టు అయిన వ్యక్తులను గుర్తించిన అధికారులు క్వారంటైన్ కు తరలించారు. అలాగే అనుమానితులను కూడా క్వారంటైన్ కు తరలించారు. టీ స్టాల్ దగ్గర టీ తాగిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. టీ అమ్మే వ్యక్తికి కరోనా సోకడంతో వైఎస్సార్ కాలనీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాలనీలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. 

మరోవైపు గుంటూరు జిల్లాలోని నరసరావు పేటలో కరోనా కేసుల జోరు తగ్గడం లేదు. ఇవాళ కొత్తగా 26 కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ నరసరావుపేటపై ఫోకస్ పెట్టారు. కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నరసరావు పేటలో కరోనా కేసులు సెంచరీ క్రాస్ చేసింది. ఇవాళ కూడా 26 కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో మొత్తం 104 కేసులు నమోదు అయ్యాయి. కరోనా కేసులు పెరగడంపై నరసరావుపేట ప్రజలకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. కరోనా కట్టడికి నరసరావు పేట డివిజన్ మొత్తాన్ని అధికారులు ఇవాళ, రేపు సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో రోడ్లన్ని నిర్మానుశ్యంగా మారాయి. 
రెడ్ జోన్లపై డ్రోన్ కెమెరాలతో పోలీసులు నిఘా పెట్టారు. ఎప్పటిప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నరసరావుపేటలోకి ఎవరినీ అనుమతించడం లేదు. ఇక వరవకట్ట ప్రాంతంలో వైరస్ స్వైర విహారం చేస్తోంది. అధికార యంత్రాంగం మొత్తం పేటపై ఫోకస్ పెట్టి ఇంటింటిని జల్లెడ పడుతున్నారు. అనుమానితులను క్వారంటైన్ కు తరలించి, పరీక్షలు చేస్తున్నారు. రోజుకు 300ల మందికు పైగా కరోనా టెస్టులు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో 2 వేల 700 మంది జనాభాతో 500 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక అంతే వైరస్ ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది. 

ఏపీలో  24 గంటల్లో 73 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు నోడల్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 1332 పాజిటివ్ కేసులకు గానూ 287 మందికి నెగెటివ్ రావడంతో డిశ్చార్జ్  చేశారు. మొత్తం 1014 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మంగళవారం (ఏప్రిల్ 28, 2020) ఉదయం 9 గంటల నుంచి బుధవారం (ఏప్రిల్ 29, 2020) వరకు రాష్ట్రంలో ఎటువంటి కరోనా మరణాలు సంభవించలేదని ప్రకటనలో వెల్లడించింది. ఏపీలో ఇప్పటివరకు కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 31 గా ఉంది.  రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కరోనా ఆస్పత్రుల్లో పని చేయుటకు కొత్తగా 1170 మంది డాక్టర్లను నియమించటానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత 24 గంటల్లో నమోదైన పాజిటివ్ కేసుల్లో గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో 53 కేసులు నమోదయ్యాయి.