ఆ రెండు దేశాల్లో మినహా.. పురుషులు, మహిళలకు కరోనా వైరస్ సమానంగా సోకింది

Submitted on 9 April 2020
Coronavirus, COVID-19 hits both genders equally, except in two nations

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. ఆడ, మగ, చిన్న, పెద్ద, వృద్ధులు అనే తేడా లేకుండా అందరికి ఈ వైరస్ సోకుతోంది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు, పురుషుల్లో సమానంగా సోకుతున్న ఈ వైరస్.. ఆ రెండు దేశాల్లో మాత్రం కాస్తా భిన్నంగా ఉన్నట్టు గ్లోబల్ డేటా విశ్లేషణలో వెల్లడైంది. చాలా దేశాల్లో మహిళల్లో కంటే పురుషులపైనే Covid-19 వైరస్ అధికంగా సోకినట్టు కనిపిస్తోంది.

ఇదే విషయాన్ని పేరు చెప్పేందుకు అంగీకరించని ఓ నిపుణుడు చెప్పారు. భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి తక్కువ పరీక్షల కారణంగా గణాంకాల్లో మార్పులు ఉండొచ్చునని ఆయన అన్నారు. గతవారమే ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశంలో 76శాతం మంది పురుషులకు కరోనా సోకినట్టు ధ్రువీకరించింది. అనేక దేశాల్లో యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్‌తో సహా కేసులు, మరణాల రేటుపై డేటాను మాత్రమే వెల్లడిస్తున్నాయి.

కానీ, లింగ విభజన చేసిన జాతీయ డేటా మాత్రం లేదు. 40 దేశాల డేటాను గ్లోబల్ హెల్త్ 5050 షేర్ చేసింది. ఇందులో లింగం, ఆరోగ్యాన్ని గుర్తించే స్వతంత్ర పరిశోధనను సూచిస్తుంది. అన్ని దేశాలలో లింగ విభజన సుమారు 50-50 అని సూచిస్తుంది. ఇందులో రెండు దేశాలను మినహాయించి సూచిస్తోంది. అవే.. భారతదేశం, పాకిస్తాన్. ఇక మన పొరుగు దేశాల్లో 4,004 కేసులలో 72శాతం పురుషుల్లో కరోనా సోకినట్టు ధ్రువీకరించింది.

గ్రీస్‌లో మొత్తం 17,551 కేసులు ఉంటే.. 55శాతం పురుషులే ఉన్నారు. ఇటలీలో 124,547 కేసులు నమోదైతే.. 53శాతం మంది పురుషులు ఉన్నారు. చైనాలో కూడా ఫిబ్రవరి 28 నుంచి ఎలాంటి డేటా అప్ డేట్ కావడం లేదు. చైనాలో ప్రస్తుతం కనిపించే డేటా ప్రకారం.. 55,924 కరోనా కేసులు నమోదు కాగా.. అందులో 51:49 నిష్పత్తితో పురుషులు, మహిళలు ఉన్నారు. సౌత్ కొరియాలో కూడా కరోనా కేసులను జనాభా ప్రాతిపాదికన టెస్టులను నిర్వహిస్తూ వచ్చింది.

ఈ దేశంలో బుధవారం నాటికి 60 శాతంతో 10వేల కేసులు నమోదు అయ్యాయి. అందులో పురుషులు, మహిళలు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ మాత్రం పురుషుల్లో కంటే మహిళలకే వైరస్ అధికంగా సోకింది. జర్మనీలో కరోనా టెస్టులు నిర్వహించగా మొత్తంగా 99,255 కేసులు నమోదయ్యాయి. వీటిలో 50:50 శాతంగా విభజించవచ్చు. ఏదిఏమైనా.. అన్ని దేశాల్లో కరోనా సోకి మృతిచెందినవారిలో మహిళల కంటే పురుషులే దాదాపు రెట్టింపుగా చెప్పవచ్చు. ప్రస్తుతానికి 18 దేశాలకు సంబంధించి మాత్రమే ఈ డేటా అందుబాటులో ఉంది. కొవిడ్-19 పురుషులు, మహిళల రేటును జాతీయంగా భారత్ ఇప్పటివరకూ షేర్ చేయలేదు. 

సామాజిక కారణాల వల్ల భారతదేశం విస్తృత అసమానత ఎక్కువగా ఉందని నిపుణులు చెప్పారు. కరోనా పరీక్షలు పెరిగినప్పుడు ఎక్కువ అంటువ్యాధులు గుర్తించినప్పుడు ఆడ, మగ మధ్య అంతరం తగ్గిపోవచ్చునని వారు అభిప్రాయపడ్డారు. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాతో సంబంధం ఉన్న epidemiologist గిరిధర్ బాబు మాట్లాడుతూ.. చాలా దేశాలలో అంతర్జాతీయ ప్రయాణికుల్లో వైరస్ వ్యాప్తికి ప్రధానంగా చెప్పవచ్చు. ఇందులో పురుషులు లేదా మహిళలు సమానంగా ఉండే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 
COVID

coronavirus
Covid-19
genders equally
Two nations
Pakistan
Health Ministry
United Kingdom  

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు