ఏపీలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న కరోనా...348కు చేరిన కేసులు

Submitted on 8 April 2020
Corona virus cases reaching to 348 in AP

ఏపీలో కరోనా కరాళా నృత్యం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు 348కి చేరాయి. కొత్తగా గుంటూరులో 8, అనంతపురంలో 7, ప్రకాశం 3, పశ్చిమగోదావరిలో ఒక్క కేసు నమోదు అయ్యింది. వైజాగ్ లో ముగ్గురు పేషెంట్స్‌ డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు 9 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. కరోనాతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. లాక్‌డౌన్‌ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు. కొన్ని ప్రాంతాల్లో నిత్యావసర సరుకులను ఇళ్లకే పంపిణీ చేస్తున్నారు. (తెలంగాణలో 453కు చేరిన కరోనా బాధితులు...11 మంది మృతి )

కరోనాపై వస్తున్న సమాచారం ఆందోళన కలిగిస్తోంది. మూడో దశ ప్రారంభంలో ఉన్నామని అధికార యంత్రాంగం చెబుతుండటంతో ఏపీ వాసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటం మరింత ఆందోళన కలిగిస్తుంది. రాయలసీమలోని మూడు జిల్లాలు, నెల్లూరుతో పాటు కోస్తాలోని రెండు జిల్లాల్లో పెరుగుతున్న పాజిటివ్ కేసులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.

కర్నూలు జిల్లాలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రాష్ట్రంలోనే అత్యధికంగా 75కి చేరుకుంది. అటు అనంతపురం జిల్లాలో కూడా కరోనా కేసులు ఆగడం లేదు. ఒక్కరోజే 7 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో అనిల్‌ కుమార్‌ తెలిపారు. 
 

corona virus
Cases
Reach
348
AP

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు