Corona virus 33 new cases in Andhrapradesh Today Discharge 79

ఏపీలో కరోనా కొత్త కేసులు 33..డిశ్చార్జ్ 79 మంది

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రతి రోజు 50 నుంచి 60 కేసులు నమోదవుతున్న సందర్భంలో తాజాగా 2020, మే 29వ తేదీ శుక్రవారం 33 మంది పాజిటివ్ కేసులు నిర్ధారించారు. మొత్తం 11 వేల 638 శాంపిల్స్ లను పరీక్షించినట్ల మీడియా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

ఇందులో 79 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, కానీ కర్నూలులో ఒకరు మరణించారని తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 2 వేల 874 పాజిటివ్ కేసులకు గాను..2037 మంది డిశ్చార్జ్ అయ్యారని, మొత్తం 60 మంది మరణించారని తెలిపింది. ప్రస్తుతం ఏపీలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 777గా ఉంది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో చిత్తూరులో 04, నెల్లూరులో 02 కోయంబేడు నుంచి మొత్తం 6 మందికి వైరస్ సోకింది. 

Read: కర్నూల్‌లో ఆసుపత్రి నుంచి పరారైన కరోనా రోగి.. బస్సెక్కి!

Related Posts