తెలంగాణలో 453కు చేరిన కరోనా బాధితులు...11 మంది మృతి 

Submitted on 8 April 2020
Corona victims hit 453 in Telangana, 11 people killed by virus

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత పెరిగింది. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వ్యాప్తి పెరుగుతోంది. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 453కి చేరింది. ప్రస్తుతం 397 మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో 11 మంది మృతి చెందగా.. మరో 45 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రోజురోజుకు కోవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడం ప్రజలను కలవరానికి గురి చేస్తోంది.  

ఇకపై పాజిటివ్‌‌ కేసులు భారీగా నమోదు కాకపోవచ్చు : మంత్రి ఈటెల 
తెలంగాణకు 95 శాతం కరోనా భయం తగ్గిందని.. ఇకపై కరోనా పాజిటివ్‌‌ కేసులు భారీగా నమోదు కాకపోవచ్చని మంత్రి ఈటెల రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు 49 పాజిటివ్ కేసులు వచ్చాయని తెలిపారు. ఇప్పటివరకు వరకు రాష్ట్రంలో 453కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయని.. ప్రస్తుతం అందులో ఎవరికీ కూడా విషమంగా లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం 397మందికి చికిత్స అందుతోందని..వీరిలో ఒక్కరు కూడా వెంటిలేటర్‌పై లేరని తెలిపారు. 

నిజాముద్దీన్ ఘటన అనంతరం పెరిగిన పాజిటివ్ కేసుల సంఖ్య 
నిజాముద్దీన్ ఘటన అనంతరం పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. తెలంగాణలో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా మర్కజ్‌ సదస్సుతో సంబంధం ఉన్నవారే ఉన్నారు. నిన్న నిర్ధారణ అయిన 40 కేసులు మర్కజ్‌తో సంబంధం  ఉన్నవే. ఇవి మరిన్ని పెరిగే అవకాశముంది. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. మర్కజ్‌ నుంచి వచ్చిన  వారితో కలిసిమెలిసి తిరిగిన ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు గుర్తించిన వారికి  పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్‌ వచ్చినవారిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మర్కజ్‌ లింకు ఉన్నవారికి సంబంధించి మరో 535 మంది ఫలితాలు రావాల్సి ఉందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. (నిరాశ్రయులకు ఆహారం అందించిన డెస్టినీ ఛేంజర్స్ పౌండేషన్)

పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో కంటోన్మెంట్‌ ప్రణాళిక అమలు 
ఇక కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన జిల్లాల్లోని ప్రాంతాల్లో అధికారులు కంటోన్మెంట్‌ ప్రణాళికను అమలు చేస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హాట్‌స్పాట్‌ జోన్లుగా గుర్తించిన ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు సీపీ సజ్జనార్‌. ప్రజలెవరూ రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

హైదరాబాద్‌లో 161 పాజిటివ్‌ కేసులు 
తెలంగాణ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌ లెక్కల ప్రకారం అత్యధికంగా హైదరాబాద్‌లోనే 161 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్‌ జిల్లాలో 39 కేసులు, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 23 ఆదిలాబాద్‌ జిల్లాలో 11,  మహబూబ్‌నగర్‌లో 10, గద్వాల జిల్లాలో 22, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోనూ 13 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో 14, సూర్యాపేటలో 9 పాజిటివ్‌ కేసు  నమోదయ్యాయి. కరీంనగర్‌లో 7, జగిత్యాలలో 3, కామారెడ్డిలో 10, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2, మేడ్చల్‌ 18, రంగారెడ్డి 27, వికారాబాద్‌లో 5 కరోనా కేసులు నమోదయ్యాయి. 
 

Corona
victims
453
Telangana
11 people
kill
Hyderabad
Minister Etela Rajender

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు