corona risk increasesafter lockdown opens in us 91 people infected with salon worke

సెలూన్ వర్కర్ కు కరోనా..ఇంకేముంది..91మందికి పాజిటివ్ వచ్చేసింది…

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

లాక్‌డౌన్ ఎత్తేశారని సంబరపడిపోవాటానికి వీల్లేదు. అస్సలు రిస్క్ అప్పటి నుంచే ప్రారంభమవుతుంది. ముందుంది ముసళ్ల పండుగ అన్నట్లుగా ఉంది లాక్‌డౌన్ ఎత్తేసిన దేశాల పరిస్థితి. లాక్‌డౌన్ ఎత్తేసిన తరువాత కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో భారత్ పరిస్థితి కూడా అలాగే ఉంటుందనే భయాందోళనలు ఉన్నాయి. 

ఈ భయం నిజమేనంటున్నాయి లాక్‌డౌన్ ఎత్తేసిన దేశాలు. యుఎస్‌లో లాక్‌డౌన్ ఎత్తేసిన త‌రువాత‌..మిస్సౌరీలో క‌రోనా సోకిన సెలూన్ కార్మికుడు 91 మందికి ఈ వ్యాధి అంటించాడు. అతను కావాలని చేయలేదు. కానీ కరోనా అటువంటిది. తాకకుండానే వచ్చే కరోనా మనిషిని తాకితే రాకుండా ఉంటుందా? అలే జరిగింది. లాక్‌డౌన్ ఎత్తేశాక సెలూన్ సెంటర్లు కష్టమర్లతో కిటకిటలాడుతున్నాయి. దీంతో కరోనా పండుగ చేసుకుంటోంది.  అలా మిస్సౌరీలోని ఓ సెలూన్ లో సెలూన్ వర్కర్ కు కరోనా సోకింది. అది అతనికి తెలీదు. పనిలోకి వచ్చేశాడు. అతని ద్వారా 84 మంది కస్టమర్లకు..మరో ఏడుగురు సెలూన్ వర్కర్లకు కరోనా వచ్చేసింది. 

 లాక్ డైన్ తరువాత మిస్సౌరీలో సెలూన్లు మే 4 న తిరిగి ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు ఇక్క‌డ 11 వేల 752 కరోనా కేసులు నమోదయ్యాయి. 676 మంది మరణించారు. మరోవైపు వాషింగ్టన్‌లోని స్పోకనే నగరంలోని పాస్తా కర్మాగారంలో 22 మంది ఉద్యోగులకు క‌రోనా సోకినట్లు గుర్తించారు. 

వాషింగ్ట‌న్‌లో పాక్షిక లాక్‌డౌన్ అమ‌లులో ఉంది. ఈ క్రమంలో కొన్ని  ఫుడ్ షాప్స్ తెరుచుకున్నాయి. ఇక్క‌డ సెలూన్లు, జిమ్‌లు జూన్ 1 తర్వాత తిరిగి ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఇక్కడ 20, 395 క‌రోనా కేసులు నమోదయ్యాయి. 1076 మంది మరణించారు. యుఎస్‌లోని మొత్తం 50 రాష్ట్రాల్లో వేర్వేరు సమయాల్లో లాక్‌డౌన్‌ల‌ను ఎత్తివేస్తున్నారు.  ఈక్రమంలో కరోనా కేసులు మరింతగా పెరిగే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. 

Read: కరోనా కేసులు : ఫస్ట్ అమెరికా..భారత్ 10th ప్లేస్