23 రోజుల చిన్నారికి కరోనా పాజిటివ్

Submitted on 7 April 2020
Corona positive for 23 days baby in mahaboob nagar district

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఆందోళన కలిగిస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలో  కరోనా వైరస్ విజృంభిస్తోంది. 23 రోజుల పసికందుకు కరోనా పాజిటివ్ రావటంతో జిల్లా ఒక్క సారిగా ఉలిక్కి పడింది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు మంగళవారం మధ్యాహ్నానికే మహబూబ్ నగర్ జిల్లాలో  మూడు కేసుల్లో పాజిటివ్ వచ్చింది. 

ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాపకింద నీరులా  విస్తరిస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లాలో దీని  ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. మరోవైపు షాద్ నగర్, మహబూబ్ నగర్ పట్టణాల్లో కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. కాగా  ఈరోజు  వైరస్ సోకిన 23 రోజుల చిన్నారికి వారి తల్లి తండ్రుల ద్వారా  వైరస్ సోకినట్లు తెలుస్తోంది.

ఇటీవలే చిన్నారి తల్లితండ్రులు నిజాముద్దీన్ మర్కస్ యాత్రకు వెళ్ళి వచ్చారని ఆవిషయాన్ని వారు గోప్యంగా ఉంచారని తెలిసింది. వైద్యా శాఖ అధికారులు అక్కడకు చేరుకుని చిన్నారిని సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఇప్పటి వరకు మహబూబ్ నగర్ జిల్లాలో  కరోనా వైరస్ వల్ల ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందటం జరిగింది.  జిల్లా వ్యాప్తంగా 32 పాజిటివ్ కేసులు నమోదు కావటంతో  ఇప్పుడు చిన్నారికి కరోనా  పాజిటివ్ వచ్చిందనే వార్త కలకలం రేపుతోంది. (ఏప్రిల్ 15 తర్వాత తెరుచుకోనున్న ఆఫీసులు)

Telangana
coronavirus
Markaz Nizamuddin
corona positive

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు