Corona Latest Update on Andhra Pradesh

ఏపీలో కరోనా..లెటెస్ట్ అప్ డేట్..ఎన్ని కేసులంటే

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఏపీలో కరోనా తగ్గుముఖం పడుతుందని అనుకుంటే..అలా జరగడం లేదు. ప్రతి రోజు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 2020, మే 24వ తేదీ ఆదివారం 11 వేల 357 శాంపిల్స్ పరీక్షించగా…66 మంది కరోనా వైరస్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 29 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, కరోనాతో ఆదివారం ఎవరూ చనిపోలేదన్నారు.

2627 పాజిటివ్ కేసులకు గాను..1807 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. మొత్తం 56 మంది చనిపోయారని, ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 764గా ఉంది. ఇక రాష్ట్రంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో చిత్తూరులో 03, నెల్లూరులో 08 కోయంబేడ్ నుంచి మొత్తం 11 మంది వచ్చారని వెల్లడించింది. విదేశాల నుంచి వచ్చిన 17 మంది వైరస్ సోకింది. ఇందులో కువైట్ నుంచి 12 మంది, దుబయ్ నుంచి ముగ్గురు, ఖతార్ నుంచి ఇద్దరిలో వైరస్ లక్షణాలు కనిపించాయి. 

Related Posts