చైనాయే ఏంటి, మనమూ కట్టగలం.. తెలంగాణలో 10 రోజుల్లో 1500 పడకల కరోనా ఆస్పత్రి

Submitted on 9 April 2020
corona hospital in hyderabad gachibowli sports stadium

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు ముస్లింలు వెళ్లొచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక్కసారిగా కరోనా కేసులు సంఖ్య డబుల్ అయ్యింది. కరోనాపై యుద్ధం ప్రకటించిన ప్రభుత్వం, మహహ్మరి కట్టడికి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటోంది. వైద్య సదుపాయాలను కూడా పెంచుతున్నారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఫేస్ చేసేందుకు ప్రభుత్వం రెడీగా ఉందని ప్రకటించింది. ఎంతమంది పేషెంట్లు వచ్చినా అందరికీ వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

అత్యాధునిక వైద్య సదుపాయాలతో 1500 పడకల ఆసుపత్రి:
ఈ క్రమంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో కరోనా పాజిటివ్ బాధితుల కోసం భారీ ఆస్పత్రిని సిద్ధం చేస్తున్నారు సీఎం కేసీఆర్. స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన కాంప్లెక్స్‌ను పూర్తిగా కరోనా ఆస్పత్రిగా మార్చుతున్నారు. బాధితులకు మెరుగైన ట్రీట్ మెంట్ అందించేందుకు చైనాలో తరహాలో 1500 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతోంది. 15 అంతస్తుల్లో ఉన్న భవనంలో 1500 పడకల ఆస్పత్రి అందుబాటులోకి రానుంది. మరిన్ని కరోనా కేసులు నమోదు అవ్వొచ్చని.. స్వయంగా సీఎం కేసీఆరే చెప్పడంతో ఆస్పత్రికి సంబంధించి నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఫర్నీచర్, కిట్స్ తరలించారు. త్వరలో కరోనా రోగులను ఈ ఆసుపత్రికి షిఫ్ట్ చేయనున్నారు. ఫైవ్ స్టార్ హోటల్ ని తలపించేలా ఈ ఆసుపత్రి నిర్మాణం జరుగుతోంది. అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఈ కరోనా ఆసుపత్రిని తీర్చిదిద్దుతున్నారు.

యుద్ధప్రాతిపదికన ఆసుపత్రి నిర్మాణ పనులు:
ఆస్పత్రి ఏర్పాటు పనులు ఎలా జరుగుతున్నాయో.. పరీక్షించేందుకు తెలంగాణ మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు స్వయంగా పరిశీలించారు. పనుల తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రులు మరింత వేగవంతంగా చేయాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 15 లోగా హాస్పిటల్ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్యం అందించేందుకు డిప్యుటేషన్ మీద 70మంది వైద్యులను, 120 మంది నర్సులను, పారా మెడికల్ స్టాఫ్ ను నియమించారు. ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు దాదాపు వెయ్యి మంది కార్మికులు అహర్నిశలూ శ్రమిస్తున్నారు.(ప్రయాణికులకు షాక్, టికెట్ రిజర్వేషన్లు ఆపేసిన ఏపీ ఆర్టీసీ)

Telangana
CM KCR
Hyderabad
gachibowli sports stadium
corona hospital
China
1500 beds
coronavirus
covid 19

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు