Corona Affected Film Stars are auctioning of valuable items

కరోనా ఫండ్ : విలువైన వస్తువులు వేలంవేసి, నిధులు సేకరిస్తున్న ఫిల్మ్ స్టార్స్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వల్ల జనాలు రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకోవడానికి మేము సైతం అంటూ ముందుకు వస్తున్నారు ఫిల్మ్ స్టార్. డబ్బున్నవారు వారి చేతనైన సాయం చేస్తుంటే.. మరికొంత మంది స్టార్ తమ విలువైన వస్తువులను వేలం వేసి.. వచ్చిన డబ్బులతో కరోనా వల్ల ఎఫెక్ట్ అయిన వారిని ఆదుకుంటున్నారు. కరోనా ఎఫెక్ట్ తో చాలా మంది రోడ్డున పడ్డారు. కార్మికులు.. రోజువారి కూలీలు.. ఇన్ కమ్ లేక.. తిండి లేక ఇబ్బంది పడుతున్న వారికి ఫిల్మ్ స్టార్స్ కూడా తమ వంతూ ఓ చేయి వేస్తున్నారు. తమ మెమరబుల్ గా దాచుకున్న వస్తువులను వేలం వేసి మరీ.. వచ్చిన డబ్బుతో కరోనా ఫండ్స్ ను కలెక్ట్ చేస్తున్నారు.

నిత్యా మీనన్ :-
నిత్యా మీనన్ కరోనా ఫండ్ కోసం డిఫరెంట్ గా ఆలోచించింది. తను ఓ ఫ్యాషన్ షో కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న డ్రస్ ను ఆన్ లైన్ లో వేలానికి పెట్టింది. సోషల్ మీడియాలో ఓ ప్రకటన కూడా ఇచ్చింది. ఈ డ్రెస్ ను ఎక్కువ డబ్బుతో ఎవరు పాడుకుంటే.. వారికి డ్రెస్ ఇచ్చేస్తానంది నిత్య. ఇలా వచ్చిన డబ్బును అర్పణం ట్రస్ట్ ద్వారా.. పల్లెటూరిలో కరోనాతో ఇబ్బంది పడుతున్న పేదలకు సహాయం చేయనున్నట్టు ఇన్ స్ట్రాలో చెప్పింది నిత్యా మీనన్. 

సోనాక్షి సిన్హా :-
ఇక బాలీవుడ్ బ్యూటీ  సోనాక్షి సిన్హా కూడా తానూ వేసిన పెయింటింగ్స్ ను ఆన్ లైన్ లో  వేలం పాటకు పెట్టింది. రీసెంట్ గా దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ ఎనౌన్స్ మెంట్ కూడా చేసింది. చాలా మంది కార్మికులు ఎంతో కష్టపడి తమ సొంత ఊర్లకు నడిచివెళ్తున్నారు. అందుకే వారికి సహాయం చేయడానికే తాను ఈ పని చేస్తున్నానంది. పెయింటింగ్ లు అమ్మగా వచ్చిన డబ్బును వలస కార్మికుల కోసం ఖర్చు చేస్తానని..వారికి రేషన్ అందిస్తానని  చెప్పింది బాలీవుడ్ బ్యూటీ.

కశ్యప్, కునాల్, వరుణ్ గ్రోవర్ :-
ఇక బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్, కమెడియన్ కునాల్ కమ్రా, రైటర్ వరుణ్ గ్రోవర్ ముగ్గురూ కలిసి కోవిడ్-19 టెస్ట్ కిట్లకోసం ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు. దీనికోసం వారు ఏకంగా వారికి వచ్చిన ఫిల్మ్ ఫేర్ ట్రోఫీలను వేలానికి పెట్టారు. ఈ వేలం ద్వారం 13 లక్షలకు పైగా సంపాధించి కొన్ని వేల మందికి సరిపోను టెస్ట్ కిట్లు కొనాలనేది వారి ప్లాన్.

వేలానికి ఫిల్మ్ ఫేర్ ట్రోఫీ :-
గ్యాంగ్స్ ఆఫ్ వశ్సేపూర్ మూవీకి కశ్యప్‌కు వచ్చిన  ఫిల్మ్‌ఫేర్ ట్రోఫీని వేలానికి పెట్టేశారు. ఎక్కువ రేట్ కోడ్ చేసిన వారికి ఫిల్మ్ ఫేర్ క్రిటిక్స్ అవార్డ్ బెస్ట్ ఫిల్మ్ 2013 సొంతమవుతుందని కశ్యప్ ట్వీట్ చేశాడు. ఆయుష్మాన్ ఖురానా – భూమి పడ్నేకర్ నటించిన దమ్ లగా కే హైసాలోని మో మో కే దాగే లిరిక్స్ కు వచ్చిన ట్రోపీని వేలం పెట్టేందుకు వరుణ్ గ్రోవర్ రెడీ అయ్యాడు. ఇలా చాలా మంది తారలు తమ విలువైన వస్తువులను వేలం వేసి మరీ కరోనా క్రైసిస్ కు ఫండ్స్ ఇస్తున్నారు. 

Read: Ramadan 2020 : నిరుత్సాహంలో సల్మాన్ ఫ్యాన్స్