గెస్ట్‌లకు జక్కన్న ఫ్యామిలీ సర్‌ప్రైజ్

Submitted on 29 December 2018
Rajamouli Family, Surprise to Guests, Jakkanna son marriage, Guest Surprise, Rajamouli son marriage

రాజమౌళి తనయుడు కార్తికేయ మ్యారేజ్, జగపతి బాబు సోదరుడు రామ్ ప్రసాద్ కుమార్తె పూజా ప్రసాద్‌తో ఈ నెల 30వ తేదీన, పింక్ సిటీ జైపూర్‌లో గ్రాండ్‌గా జరగనున్న సంగతి తెలిసిందే. నిన్న టాలీవుడ్ సెలబ్రెటీలందరూ జైపూర్ వెళ్ళారు. రాజమౌళి, రమా దంపతులు గెస్ట్‌లందర్నీ దగ్గరుండి మరీ రిసీవ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా, రాజమౌళి, ప్రభాస్ కలిసి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే, పెళ్ళికి వచ్చే అతిథులకు రాజమౌళి ఫ్యామిలీ ఒక సర్‌ప్రైజ్ ఇచ్చింది. గెస్ట్‌లకు ఎలాట్ చేసిన హోటల్ రూమ్ కార్డ్స్‌ని స్పెషల్‌గా డిజైన్ చేయించారు. ఎవరి గదిపై వారి వారి ఫ్యామిలీ ఫోటోలను ప్రింట్ చేసారు. 

ఈ కార్డ్స్‌ని ఫోటోలు తీసి, బంగారం సేస్ ఎస్‌ఎస్ అనే హ్యాష్ ట్యాగ్‌తో నాని మిసెస్ అంజనా, చెర్రీ వైఫ్ ఉపాసన, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు. ఇంతకీ ఈ బంగారం సేస్ ఎస్‌ఎస్ అంటే ఏంటయ్యా అంటే, పూజని కార్తికేయ బంగారం అని పిలుస్తాడట. ఆమేమో ఎస్‌ఎస్ అని పిలుస్తుందట. నిన్న మెహందీ ఫంక్షన్ జరగగా, ఈరోజు సంగీత్ వేడుక చెయ్యనున్నారు. రేపు కార్తికేయ, పూజా ప్రసాద్‌ల వివాహం ఘనంగా జరగబోతుంది.

Rajamouli Family
Surprise to Guests
Jakkanna son marriage
Guest Surprise
Rajamouli son marriage

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు