ఫస్ట్ డే.. భారత్ లో 70వేల మంది జననం

Submitted on 2 January 2019
 69,944 babies , Newy Years Day, UNICEF, US, China, NewBorn Babies
  • ఇండియాలో 18 శాతం అత్యధికం.. యునిసెఫ్ సర్వే వెల్లడి 

ప్రపంచంలోనే అత్యధికంగా న్యూ ఇయర్ రోజున భారత్ లో దాదాపు 70 వేల మంది జన్మించారు. జనవరి 1 రోజున ఒక్క ఇండియాలోనే 18 శాతం (69,944) మంది జన్మించినట్టు ది యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్(యునిసెఫ్) వెల్లడించింది. ప్రపంచవ్యాస్తంగా కొత్త సంవత్సరం రోజున 3,95,072 మంది బేబీలు జన్మించినట్టు యునిసెఫ్ పేర్కొంది. ఇక పక్క దేశమైన చైనాలో (44,940) బేబీలు జన్మించగా, పాకిస్థాన్ లో (15,112), నైజీరియాలో (25,685), ఇండోనేషియాలో (13,256), అమెరికాలో (11,086), డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో (10,053), బంగ్లాదేశ్ లో (8,428) మంది బేబీలు జన్మించినట్టు తెలిపింది.

సిడ్నీలో న్యూ ఇయర్ రోజున ముందుగా 168 బేబీలకు ఆహ్వానం పలకగా.. ఆ తరువాత టోక్యో (310), బీజింగ్ (605), మడ్రిడ్ (166), న్యూయార్క్ లో (317), పసిఫిక్ ఫిజితో పాటు యూఎస్ లో చివరిగా 2019 ఏడాదికి (11,086) బేబీలను ఆహ్వానించినట్టు యునిసెఫ్ వెల్లడించింది. 'ఈ కొత్త ఏడాది రోజున పుట్టిన ప్రతి ఆడబిడ్డ, మగబిడ్డకు భూమి మీద జీవించే హక్కు ఉంది. పుట్టిన బిడ్డల ఆరోగ్యం విషయంలో హెల్త్ వర్కర్లు కేర్ తీసుకుంటే మిలియన్ల మంది బేబీలను ప్రపంచవ్యాప్తంగా బతికించుకోగలమని యునిసెఫ్ అభిప్రాయపడింది. పుట్టే ప్రతి బేబీ సురక్షమైతన చేతుల్లో జన్మించేలా అందరూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది' అని యునిసెఫ్ ప్రతినిధి యాస్మిన్ అలి హక్యూ పేర్కొన్నారు.

 69
944 babies
Newy Years Day
UNICEF
US
China
NewBorn Babies

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు