ఎమ్మెల్యే కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీరియస్ : షోకాజు నోటీసులు జారీ

Submitted on 19 June 2019
Congress issued Showcause notices to MLA Komatireddy rajagopalareddy

కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై ఆ పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. టీపీసీపీ క్రమశిక్షణ సంఘం ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల సమన్వయకర్త కుంతియాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాజగోపాల్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి భవిష్యత్‌ లేదని, టీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయం అన్నారు. అలాగే ఎన్నికల్లో ఓటమికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని.. కానీ తెలంగాణలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తనకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పెద్దలు సీరియస్ అయ్యారు.

కోదండరెడ్డి అధ్యక్షతన గాంధీ భవన్‌లో భేటీ అయిన క్రమశిక్షణా కమిటీ.. పార్టీని, రాహుల్ గాంధీని రాజగోపాల్ రెడ్డి అవమానించారని చెప్పింది. ప్రధాని మోడీని పొగడడం అంటే రాహుల్‌ గాంధీని అవమానించడమే అని తేల్చింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ రాజగోపాల్ రెడ్డికి షోకాజ్‌లను జారీ చేసింది.

ఇదిలావుండగా రాజగోపాల్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ పార్టీ అధిష్టానం ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. రాజ్‌ గోపాల్‌ రెడ్డి వ్యూహాన్ని తిప్పికొడతామని హస్తం నేతలు చెబుతున్నారు. పార్టీ మారితే ఫిరాయింపుల చట్టం కింద స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.

Congress
issue
Showcause
Notices
MLA Komatireddy rajagopalareddy


మరిన్ని వార్తలు