మీరు ట్రై చేశారా! : బొద్దింకలతో కొత్త చాలెంజ్

Submitted on 12 May 2019
cockroaches chalenge

సోషల్ మీడియా పుణ్యమా అని కొంతమంది ఓవర్ నైట్ స్టార్ లు అయిపోతుంటారు.ఏ నిమిషంలో ఎవరు ఫేమస్ అవుతారో చెప్పలేం. ఏ అంశం వైరల్ అవుతుందో తెలీదు.అదే సోషల్ మీడియా మహిమ.బీర్ బాత్ ఛాలెంజ్,ఏస్ బకెట్ చాలెంజ్,రైస్ బకెట్ చాలెంజ్ ఇలా అనేక రకాల చాలెంజ్ లు సోషల్ మీడియాలో తైగ వైరల్ అయిన విషయం తెలిసిందే.ఇప్పుడు కొత్తగా మరో చాలెంజ్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. సాధారంగా బొద్దింక కన్పిస్తేనే మనం చీదరించుకుంటాం.అయితే అలాంటి బొద్దింకను ముఖంపై పెట్టుకుని సెల్ఫీ దిగి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి.

ఈ ఏడాది ఏప్రిల్ లో  మయన్మార్మ్ కు చెందిన అలెక్స్ ఆంగ్ అనే యువకుడు పెద్ద బొద్దింకు ముఖంపై పెట్టుకుని ఫొటో దిగి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.అంతే ఒక్క రోజులో ఈ పోస్ట్ ను దాదాపు 20వేల మందికి పైగా షేర్ చేశారు.ఇక అప్పటినుంచి ఈ చాలెంజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మయన్మార్,ఇండోనేషియా,ఫిలిప్పీన్స్ దేశాల్లోని అనేకమంది బొద్దింకతో సెల్ఫీ దిగి పోస్ట్ చేస్తున్నారు.ఫొటోల కోసం ఎక్కువగా అమెరికా జాతికి చెందిన బొద్దింకలను వాడుతున్నారు.ఈ బొద్దింకలను ఆగ్నేసియా దేశాల్లో ఇళ్లల్లో పెంచుకుంటారు.
 

cockroaches
challange
MAYANMAR
social media

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు