కొలువుల జాతర...9వేల ఉద్యోగాలకు కోల్ ఇండియా నోటిఫికేషన్!

Submitted on 19 September 2019
Coal India To Announce Bumper Job Openings! CIL Set To Recruit 9000 People

ఓ వైపు ఆర్థికమాంద్యం కారణంగా దేశంలో పలు ప్రముఖ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు తమ ఫ్లాంట్ లకు సెలవులు ఇవ్వడం,క్రమంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడం చేస్తున్న ఈ సమయంలో కోల్ ఇండియా లిమిటెడ్(CIL)కొలువుల జాతరను ప్రకటించింది. త్వరలోనే కోల్ ఇండియా 
9000 ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేయనుందని సమాచారం. పోటీపరీక్షలు, ఇంటర్వ్యూలు, అంతర్గత నియామకాల ద్వారా ఈ పోస్టులను పోస్టులను భర్తీ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.


గడచిన దశాబ్దకాలంలో ఇదే అతిపెద్ద రిక్రూట్‌మెంట్ డ్రైవ్ అని.. కోల్ ఇండియా పరిధిలోని 8 సబ్సిడరీ కంపెనీలలో ఈ నియామకాలు చేపట్టనున్నట్లు ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ తెలిపింది. ఎగ్జిక్యూటివ్ పోస్టులను సంస్థ భర్తీ చేయనుండగా.. కార్మికులు, టెక్నికల్ ఉద్యోగాల భర్తీని సబ్సిడరీ కంపెనీలు చేపడతాయి. ఈ డ్రైవ్ ద్వారా చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఖాళీల భర్తీ కోసం కోల్ ఇండియా ఎక్కువ సంఖ్యలో ఎగ్జిక్యూటివ్‌లను నియమించనుంది.

కోల్ ఇండియా గతేడాది 1200 ఉద్యోగ నియామాకాలు చేపట్టగా.. ఈ ఏడాది 9 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టడం లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో 4000 ఖాళీలు ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు ఉన్నాయి. వీటిలో 900 పోస్టులను ప్రకటనలు, ఇంటర్వూ ద్వారా, 2200 పోస్టులను పోటీ పరీక్షల ద్వారా, 400 పోస్టులను క్యాంపస్ ప్లేస్‌మెంట్ల ద్వారా, మిగతా పోస్టులను వేర్వేరు విధానాల్లో భర్తీ చేయనున్నారు.

ఇక నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల విషయానికొస్తే.. వీటిలో ప్రధానంగా కార్మికులు, టెక్నికల్ పోస్టులు కలిపి మొత్తం 5000 ఖాళీలను సంస్థ నిబంధనల ప్రకారం భర్తీ చేయనున్నారు. వీటిలో 2300 పోస్టులను కోల్ ఇండియా ప్రాజెక్టుల కారణంగా భూమిని కోల్పోయిన నిర్వాసిత కుటుంబాల్లోని వ్యక్తులతో భర్తీ చేయనున్నారు. ఇక 2350 పోస్టులకు కారుణ్య నియామకాలు చేపట్టనున్నారు.

కోల్ ఇండియాలో మొత్తం 2లక్షల 80వేలమంది ఉద్యోగలు పనిచేస్తుండగా.. వీరిలో 18వేల మంది ఎగ్జిక్యూటివ్ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఉన్నారు.
భారత్‌లో రైల్వేల తర్వాత ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఉన్న పబ్లిక్ సెక్టర్ సంస్థగా ‘కోల్ ఇండియా’ నిలిచిందని ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. 

Coal India
Announce Job Openings
CIL
Recruit
9000 People

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు