ఇంటర్ బోర్డు రద్దవుతుందా ?

Submitted on 24 April 2019
CM KCR Serious on the Confusion of Inter Results

ఇంటర్ బోర్డు ప్రక్షాళన దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇంటర్ బోర్డు ఫలితాల గందరగోళంపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. ప్రగతి భవన్ లో మంత్రి జగదీశ్ రెడ్డి, విద్యాశాఖ అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. స్వతంత్ర సంస్థకు పరీక్షల నిర్వహణ బాధ్యతను అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటర్ ఫలితాల గందరగోళం విషయంలో ఇద్దరు ఇంటర్ బోర్డు అధికారులపై వేటు వేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. గ్లోబరీనా టెక్నాలజీ సంస్థపై విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. ఇంటర్ పరీక్షా ఫలితాల్లో గందరగోళంపై త్రిసభ్య కమిటీ విచారణ పూర్తి చేసింది. కాసేపట్లో సీఎస్ జోషికి నివేదిక అందజేయనుంది. 
Also Read : కుబేరుడి అప్పు తీరలేదా స్వామీ : రూ.12వేల కోట్లకు చేరిన TTD డిపాజిట్లు

ఇంటర్ బోర్డును రద్దు చేసే అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. దేశ శ్యాప్తంగా సీబీఎస్ ఈ విధానం అమలవుతోంది. సీబీఎస్ ఈలో ఇంటర్, ఎస్ ఎస్ సీ అనే వేరియేషన్ లేదు. పదో తరగతి వరకు 10 అని, ఆ తర్వాత 10+2 అని ఉంటుంది. ఆ రకంగానే తెలంగాణలో 10, 10+2 విధానం తీసుకొస్తే ఎలా ఉంటుంది. ఇంటర్ బోర్డును పూర్తిగా రద్దు చేయాలా లేదా టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణను స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థకు అప్పగించాలా, ఒకవేళ అప్పగిస్తే ఎలా ఉంటుందనే దిశగా సమాలోచనలు జరిగినట్లు సమాచారం.

ఇంటర్ బోర్డు రద్దుకు కీలక నిర్ణయం తీసుకుని దిశగా ప్రభుత్వం సిద్ధమతువున్నట్లు కనిపిస్తోంది. అవసరమైతే ఎస్ఎస్ సీ బోర్డులోనే ఇంటర్ విద్యను విలీనం చేసి 10, 10+2 విద్యా విధానంతోనే ముందుకు వెళ్లాలా లేదా అలాగే ఉంచి ఎస్ ఎస్ సీ, ఇంటర్, ఎంసెట్ పరీక్షల నిర్వహణను స్వతంత్ర సంస్థకు అప్పగించాలా అన్న విషయాలపై ఆలోచిస్తోంది. 
Also Read : కేసీఆర్ కీలక నిర్ణయం : ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కు ఫ్రీగా రీ వెరిఫికేషన్

CM KCR
Serious
Confusion
Inter Results
Hyderabad

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు