నెలకు రూ.5వేలు : ఏపీలో కొత్త పథకం ప్రారంభం

Submitted on 2 December 2019
cm jagan launch new scheme in ap

అధికారంలోకి వచ్చాక ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు, స్కీమ్ లు తీసుకొచ్చిన జగన్ ప్రభుత్వం.. తాజాగా మరో పథకాన్ని ప్రారంభించింది. అదే వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా. రోగులకు ఆర్థికంగా అండగా ఉండేలా ఈ స్కీమ్ ని తీసుకొచ్చారు. సోమవారం(డిసెంబర్ 2,2019) ఉదయం గుంటూరు జీజీహెచ్‌లో ఈ స్కీమ్ ప్రారంభించిన సీఎం జగన్.. లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాం అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని పని చేస్తున్నామని.. జనవరి 1 నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు అందజేస్తామన్నారు.

ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి.. డిసెంబర్‌ 1 నుంచి రోజుకు రూ.225 లేదా నెలకు రూ.5 వేల ఆర్థిక సాయం అందిస్తారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన 48 గంటల్లోనే నేరుగా లబ్దిదారుల అకౌంట్‌లో జమ చేస్తారు. 26 ప్రత్యేక విభాగాల్లో 836 రకాల శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి ఆరోగ్య ఆసరా స్కీమ్ వర్తిస్తుంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాక విశ్రాంతి తీసుకునే కాలానికి ఈ నగదు సాయం చేస్తారు. రోగి డిశ్చార్జి అయ్యే సమయంలో బ్యాంకు ఖాతా, ఆధార్‌ కార్డు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ బ్యాంకు ఖాతా లేకపోతే బంధువుల బ్యాంకు ఖాతా ఇస్తే దానికి సొమ్మును జమ చేస్తారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై ఏడాదికి రూ. 268.13 కోట్లు భారం పడుతుంది.

ap cm jagan
new scheme
Launch
ysr arogya asara
guntur
Operations
help
arogyasri

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు