కొత్త క్లైమాక్స్‌తో లవర్స్ డే

Submitted on 19 February 2019
Claimax Change in Lovers Day-10TV

కొంటె సైగతో, కుర్రాళ్ళ మనసులకు గన్ను లాంటి కన్ను కొట్టిన  ప్రియా వారియర్, రోషన్ జంటగా  నటించిన మలయాళ సినిమా ఒరు ఆధార్ లవ్, తెలుగులో లవర్స్ డేగా, ఫిబ్రవరి 14 న ప్రేమికుల దినోత్సవం కానుకగా రిలీజ్ అయ్యింది. లవర్స్ డే నాడు పార్కుల్లో కనబడితే పెళ్ళి చేసేస్తారేమోనని భయపడ్డ ప్రేమికులు, సినిమాని ఎంజాయ్ చేద్దామని థియేటర్స్‌కెళ్ళారు.. కాసేపటికే సినిమాలో మేటర్ లేదని అర్థం అయ్యింది. ముఖ్యంగా క్లైమాక్స్ మన ఆడియన్స్‌కి కనెక్ట్ కాలేదు. దెబ్బకి రెండో రోజునుండి కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.. ఈ విషయాన్ని త్వరగా గెస్ చేసిన మూవీ యూనిట్, సదరు నష్టాన్ని భర్తీ చేసే పనిలో పడింది.

బుధవారం నుంచి కొత్త క్లైమాక్స్‌తో సినిమా ప్రదర్శిత మవుతుందని డైరెక్టర్ చెప్పాడు. రియలిస్టిక్‌గా ఉండాలని క్లైమాక్స్‌కి ట్రాజెడీ యాడ్ చేసాను.. ఆ క్లైమాక్స్ ఆడియన్స్‌ని అంతగా ఆకట్టుకోలేదు.. అందుకే క్లైమాక్స్ మళ్ళీ షూట్ చేసాం.. ఫిబ్రవరి 20 (బుధవారం) నుండి లవర్స్ డే పదినిమిషాల కొత్త క్లైమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని డైరెక్టర్ ఒమర్ చెప్పాడు.

వాచ్ టీజర్...
 

Roshan Abdul Rahoof
Shaan Rahman
Priya Prakash Varrier
Sukhibava Cinemas
Omar Lulu

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు