యువతులపై రంగుల వల : సినీ అవకాశాల పేరుతో అత్యాచారాలు

Submitted on 14 March 2019
Cinematographer Shanmuku Vinay is arrested for raping a young girl the film Chance

హైదరాబాద్‌: సినిమా..సినిమా..సినిమా..రంగుల ప్రపంచం..ఈ రంగుల ప్రపంచంలో వెండితెరపై వెలిగిపోవాలని ఎందరికో కల. ఆ కలను సాకారం చేసుకోవటానికి పడరాని పాట్లు పడుతుంటారు. దాని కోసం ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకుంటు..తిని..తినకా కడుపు మాడ్చుకుని సినిమా అవకాశాల కోసం పడిగాపులు పడుతుంటారు. ఇది అవకాశంగా చేసుకుని కొంతమంది గుంటకాడ నక్కలు వాళ్ల మానాలపై సొమ్ములు దండుకుంటున్నారు. . 

యువతులను మభ్య పెడుతూ..వారిపై అత్యాచారాలకు తెగబడుతున్నారు. రంగుల ప్రపంచంలో విహరించాలనే ఆకాంక్షతో మోసాలను గుర్తించలేక..గుర్తించినా తమ కోరిక నెరవేరుతుందనే ఆశతో దగాపడుతున్న పడతులు ఎంతోమంది. సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇప్పిస్తామంటే చాలు ఎగిరి గంతేసి..పొంచి వున్న ప్రమాదాన్ని గుర్తించలేక బలైపోతున్నారు యువతులు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ఖడ్గం సినిమాలో హీరోయిన్ (క్యారక్టర్ పేరు సీతామహాలక్ష్మి, హీరోయిన్ సంగీత) పాత్ర ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అది కేవలం సినిమా సీన్ మాత్రమే కాదు అటువంటి దారుణాలకు గురయ్యే యువతులు జీవితాలు వెలిసిపోయిన రంగుల్లో మరుగున పడిపోతుంటాయి. 
Read Also : రక్త శుద్ధికి వెళ్తే కిడ్నీ దొబ్బేశారు

ఈ క్రమంలో  సినిమా పరిశ్రమలో అవకాశాలు కల్పిస్తానని సినిమాటోగ్రాఫర్‌ షన్ముఖ్‌ వినయ్‌ ఓ యువతిని మోసం చేసిన  ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. బొడుప్పల్‌కు చెందిన ఓ యువతి సినీ అవకాశాల కోసం వినయ్‌ను కలిసింది. వినయ్‌ ఆమెకు హీరోయిన్ అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించాడు. దీంట్లో భాగంగా మాదాపూర్‌లోని ఓ గెస్ట్‌ హౌస్‌కు పిలిపించుకుని ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. అనంతరం ఆమె అతనిపై అవకాశాల కోసం గట్టిగా నిలదీసింది. దాంతో పెళ్లి చేసుకుంటానని పలుమార్లు అదే పనిచేశాడు. తరువాత ముఖం చాటేయడంతో సదురు యువతి మాదాపూర్‌ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. ఆమె ఫిర్యాదుతో వినయ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు రేపు కేసు నమోదు చేసినట్టు మాదాపూర్‌ ఏసీపీ ప్రసాద్‌రావు తెలిపారు. నిందితుడు వినయ్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. ఇలా సినిమా అవకాశాల పేరుతో మోసంపోయి..అటు జీవితంలోను సెటిల్ కాక..ఇటు సినిమా అవకాశాలు రాక జీవితంలో ఎదురు దెబ్బలు తినీ తినీ చివరకు జీవితాంతం కుమిలిపోయేవారు ఎందరో..ఎందరెందరో.
Read Also : కాపురంలో ‘దున్నపొతు’ చిచ్చు.. భార్య కాళ్లను నరికేసిన భర్త

Hyderabad
Film Chance
Cinematographer
Sasmukh Vinay
cheating
Case
complaint
Arrest

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు