నాగలక్ష్మికి చిరు సాయం.. అదే ఆమె గుండె చప్పుడు..

Submitted on 7 April 2020
Chiranjeevi Helps to Fan

మెగాస్టార్ చిరంజీవి తన అభిమానికి సాయం చేసి మరోమారు తన మంచి మనసు చాటుకున్నారు. అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్ష్యులు రవణం స్వామినాయుడు ఆ వివరాలు తెలియచేస్తూ ఓ లేఖ విడుదల చేశారు.
‘‘దైవం మానుషరూపేణా ' అన్నారు పెద్దలు. 
అంటే.. మనుషుల్లోనే దేవుడున్నాడని అర్ధం. 
ఆ విషయాన్ని పదేపదే తన పెద్ద మనస్సుతో నిరూపిస్తున్నారు మన మెగాస్టార్‌ శ్రీ చిరంజీవి గారు. 
గుంటూరు జిల్లా "చిరంజీవి అంజనా మహిళా సేవా సంస్ధ" అధ్యక్షురాలు కుమారి రాజనాల వెంకట నాగలక్ష్మి గుండె జబ్బుతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న చిరంజీవి గారు మెడికల్‌ రిపోర్ట్స్‌ తెప్పించుకుని హైదరాబాద్‌ స్టార్‌ హాస్పిటల్స్‌ చైర్మన్ & ఎండి మరియు ఫేమస్ హార్ట్‌ సర్జన్ 
శ్రీ Dr. గోపీచంద్ గారి ద్వారా జబ్బు తీవ్రతను గమనించారు.


వెంటనే హుటాహుటిగా ఆమెను హైదరాబాద్‌కి రప్పించే ఏర్పాట్లు చేసి, ఆపరేషన్‌కి సంబంధించి అన్ని సదుపాయాలు దగ్గరుండి చూసుకుంటున్నారు.
ఏప్రిల్ 8న ఆమెకి ఆపరేషన్‌ జరపటానికి ప్రయత్నం చేస్తున్నారు. తనను అమితంగా ప్రేమిస్తున్న అభిమానుల ఆరోగ్యం పట్ల వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటున్న శ్రీ చిరంజీవి గారి మంచి మనసుకి ప్రత్యేక ధన్యవాదాలు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు కోటి రూపాయలు విరాళం ఇచ్చిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. 
నాగలక్ష్మి గారు తొందరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతురాలవ్వాని మనసారా ఆకాంక్షిస్తూ..
ఆ భగవంతుడుని ప్రార్థిస్తూ.. జై చిరంజీవ... జై జై చిరంజీవ’’ అంటూ స్వామి నాయుడు లేఖలో పేర్కొన్నారు.

Read Also : ఎవరు విక్రమ్? ఎవరు వేద?

Chiranjeevi
help
Nagalakshmi
Fan
Swamy Naidu

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు