ప్రపంచంలోనే అతిపెద్ద స్టోర్ : హైదరాబాద్‌లో OnePlus ఎక్స్‌పీరియ‌న్స్‌ సెంటర్

Submitted on 15 May 2019
Chinese Smartphone maker OnePlus to set up its largest experience center in Hyderabad

చైనీస్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ మేకర్ OnePlus నుంచి హైదరాబాద్ లో వరల్డ్ Largest Experience Center స్టోర్ రాబోతుంది. ఇండియాలో తమ స్మార్ట్ ఫోన్ రిటైల్ మార్కెట్ ను విస్తరించే దిశగా వన్ ప్లస్ ప్లాన్ చేస్తోంది. 2019 ఏడాదిలో మొత్తం మూడు కొత్త న్యూ బిగ్గెస్ట్ ఎక్స్ పీరియన్స్ స్టోర్లను ప్రారంభించనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద వన్ ప్లస్ స్టోర్ ను హైదరాబాద్ నగరంలో ప్రారంభించనుంది. రెండోవది.. వన్ ప్లస్ ఎక్స్ పీరియన్స్ స్టోర్ ను పుణెలో ప్రారంభించనుంది.  
Also Read : కాలాంతకులు : వెయ్యి రూపాయల సాఫ్ట్‌వేర్ తో వాట్సాప్‌ కే బురిడీ!

‘ 2019 ఏడాదిలో మేము.. మూడు కొత్త ఎక్స్ పీరియన్స్ స్టోర్లను ఓపెన్ చేయబోతున్నాం. పుణెలో ఒక ఎక్స్ పీరియన్స్ స్టోర్ ఓపెన్ చేస్తాం. హైదరాబాద్ లో ఓపెన్ చేయబోయే వన్ ప్లస్ స్టోర్ (16వేల చదరపు అడుగులు) ప్రపంచంలోనే అతిపెద్దది’ అని వన్ ప్లస్ సహా వ్యవస్థాపకుడు Carl Pei తెలిపారు. వన్ ప్లస్ కంపెనీకి సంబంధించి ఎక్స్ పీరియన్స్ సెంటర్లు ఇప్పటికే బెంగళూరు, ఢిల్లీ, చెన్నైలో ఉన్నాయి కూడా.

ఇండియా.. సెకండ్ హోం గ్రౌండ్ :
స్మార్ట్ ఫోన్ సేల్ మార్కెట్ కు ఇండియా కీలకంగా మారింది. 2018లో కంపెనీకి భారీ రెవెన్యూ రావడంతో.. వన్ ప్లస్ కంపెనీ.. ప్రత్యేకించి ఇండియానే తమ మార్కెట్ విస్తరణలో ఒక భాగంగా ఎంచుకుంది. చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ వన్ ప్లస్.. ఇండియాను తమ రెండో హోం గ్రౌండ్ గా గతంలోనే పేర్కొంది. 

స్మార్ట్ ఫోన్ మేకర్లు షియోమీ, వన్ ప్లస్, మోటరోలా కంపెనీలు ఇండియాలో తమ ప్రొడక్టులను పోటీపడి రిలీజ్ చేస్తు వస్తున్నాయి. ఈ కామర్స్ ప్లాట్ ఫాం  ద్వారా భారత్ లో తమ ఆన్ లైన్ మార్కెట్ ను విస్తరించుకున్నాయి. చివరికి ఇండియాలో ఆఫ్ లైన్ మార్కెట్ రూట్ ను కూడా సక్సస్ ఫుల్ గా విస్తరించాయి.
Also Read : ఇండియాలో ఎప్పుడంటే : ఆపిల్ కొత్త TV App వచ్చేసింది

ఇండియాలోని ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్లలో ఈ మూడు కంపెనీలు స్మార్ట్ ఫోన్లతో సేల్స్ సునామీ సృష్టిస్తున్నాయి. ఇప్పటికే సౌత్ కొరియన్ మొబైల్ మేకర్ శాంసంగ్, ప్రపంచ ఐటి దిగ్గజం ఆపిల్ తమ ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిగ్మంట్ ప్రొడక్టులను గ్లోబల్ గా ప్రవేశ పెడుతున్నాయి. వీటికి పోటీగా చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ వన్ ప్లస్ కూడా తమ ప్రొడక్టులను వరుసగా రిలీజ్ చేస్తోంది.

వన్ ప్లస్ ఫీచర్లు అదుర్స్ :
వన్ ప్లస్ 7, వన్ ప్లస్ 7 ప్రో లేటెస్ట్ జనరేషన్ స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేయగా.. మార్కెట్లో రూ.32వేల 99 నుంచి (6GB ర్యామ్), రూ.37వేల 999 (8GB ర్యామ్) వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వన్ ప్లస్ 7 ప్రో  నుంచి మూడు వేరియంట్లు (6GB, 8GB, 12GB ర్యామ్) ఉండగా.. ధర రూ.48వేల 999 నుంచి రూ.57వేల 999 వరకు ఉన్నాయి. వన్ ప్లస్ 7 ప్రో ఫీచర్లలో 6.67 అంగుళాల డిసిప్లే, ట్రిపుల్ లెన్స్ రియర్ కెమెరా సెటప్ (48MP+16MP+8MP), బ్యాటరీ సామర్థ్యం 4,000mAH ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

 

Chinese Smartphone maker
OnePlus
largest experience center
Hyderabad

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు