చైనాకి షాక్ : 27 ఏళ్ల కనిష్ఠానికి జీడీపీ

Submitted on 19 October 2019
Chinas economic growth drops to lowest level

ప్రపంచంలో అగ్రదేశంగా ఎదగాలని చూస్తున్న డ్రాగన్ కంట్రీ చైనాకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. చైనా జీడీపీ పడిపోయింది. 27 ఏళ్ల కనిష్టానికి దిగజారింది. అమెరికాతో ట్రేడ్ వార్ ప్రభావంతోపాటు దేశీయ గిరాకీ మందగించడం వల్ల చైనా ఆర్థికాభివృద్ధి క్షీణించింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం గణాంకాలను బట్టి జీడీపీ వృద్ధి రేటు 27 ఏళ్ల కనిష్ఠానికి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 6.2 శాతంగా నమోదైంది.

మూడో త్రైమాసికంలో 6.0 శాతంగా నమోదైంది. 1992 తర్వాత ఇంత తక్కువ జీడీపీ వృద్ధి రేటు నమోదైన త్రైమాసికం ఇదే. అయితే చైనా ఈ ఏడాది మొత్తంలో 6.0 శాతం నుంచి 6.5 శాతం మధ్యలో వృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
 
నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ అధికార ప్రతినిథి మావో షెన్‌గ్యాంగ్ మూడో త్రైమాసిక ఫలితాలను వెల్లడించారు. చైనా దేశీయ, అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొందని, అయినప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం మీద స్థిరత్వాన్ని సాధించిందని చెప్పారు.

China
economic growth
drops
lowest level

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు