కృత్రిమ సూర్యుడు 

Submitted on 30 November 2019
China's "artificial sun" device set to be commissioned in 2020

చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్న కృత్రిమ సూర్యుడు 2020లో వినియోగం రానున్నట్లు తెలుస్తోంది. దీనిని హెచ్ఎల్-2ఎం టోకామాక్ అని పిలుస్తున్నారు. సూర్యుడిలో సహజంగా జరిగే ప్రక్రియల మాదిరిగానే దీనిలో కూడా హైడ్రోజన్, డ్యూటేరియం వాయు ఇంధనాలను అణు సంలీనం చేస్తుందని, తద్వారా అనంతమైన, పర్యావరణ హితమైన శక్తిని విడుదల చేస్తుందని చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా తెలిపింది.

అత్యాధునిక నియంత్రణ విధానాలు కలిగిన ఈ కొత్త వ్యవస్థ 20 కోట్ల డిగ్రీ సెల్సియస్ కు పైగా ఉష్టాన్ని పుట్టిస్తోందని సౌత్ వెస్టర్న్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ అధిపతి డురాన్ జురు తెలిపారు. జూన్ లో కాయిల్ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో హెచ్ఎల్-2ఎం టోకామాక్ పనులు వేగంగా సాగుతున్నట్లు చెప్పారు.

సూర్యుడి కేంద్ర భాగంలో అణు విచ్ఛిత్తి జరిగినప్పుడు 1.5 కోట్ల డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉంటే.. ఈ పరికరంలోని ప్లాస్మాలో న్యూక్లియర్‌ ఫ్యూజన్‌ జరిగినప్పుడు అయాన్‌ కేంద్రంలో 7రెట్లు అంటే 10 కోట్ల డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వెలువడనుంది. అంత ఉష్ణోగ్రతను తట్టుకునే సామర్థ్యం హెచ్‌ఎల్‌-2ఎంకు ఉందని చైనా నేషనల్‌ న్యూక్లియర్‌ కార్పొరేషన్‌ అధికారి డుయాన్‌ తెలిపారు.

కృత్రిమ సూర్యుడు అంతర్జాతీయ థర్మోన్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్టర్ ప్రాజెక్టులో చైనా పాల్గొనడానికి కీలకమైన సాంకేతిక సహాయాన్ని అందిస్తుందన్నారు. అలాగే ఫ్యూజన్ రియాక్టర్ల స్వీయ రూపకల్పన, నిర్మాణాన్ని ఆయన గుర్తించారు.
 

 

China
ARTIFICIAL SUN
device
Set
Commission
2020

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు