పుజారా సెంచరీ రికార్డుల మోత.. 

Submitted on 3 January 2019
India vs Australia, Cheteshwar Pujara, Pujara Test Career, IND vs AUS, 4th Test Sydney
  • ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా టీమిండియా నాల్గో టెస్టు సిరీస్

  • సిరీస్ లో మూడో సెంచరీ.. విదేశీ గడ్డపై అత్యధిక సెంచరీలు చేసిన ఘనత 

  • టెస్టు కెరీర్ లో 68వ టెస్టు.. 18వ సెంచరీ.. హైస్కోరు బ్యాట్స్ మన్ ఇతడే 

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ లో భారత ఓపెనర్ చటేశ్వర్ పుజారా మూడో సెంచరీ నమోదు చేశాడు. ఆసీస్ తో సిడ్నీ వేదికగా భారత్ నాల్గో టెస్టు ఆడుతోంది. ఈ టెస్టులో పుజారా మూడో సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా పుజారా 68వ టెస్టుతో తన కెరీర్ లో 18వ సెంచరీ నమోదు చేసి రికార్డు సృష్టించాడు. అడిలైడ్ తొలి టెస్టులో 123 పరుగులు సాధించిన పుజారా.. మెల్ బోర్న్ మూడో టెస్టులో 106 పరుగులు సాధించాడు. నాల్గో టెస్టులో (130) కలిపి మొత్తం మూడు ఇన్నింగ్స్ లలో 30 ఏళ్ల పుజారా 199 బంతుల్లో 13 ఫోర్లు కొట్టి ఈ ఫిగర్స్ ను సాధించాడు.

ఇప్పటివరకూ అతడి ఖాతాలో 428 పరుగులు ఉన్నాయి. నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో అత్యధిక పరుగులు సాధించన ఆటగాడిగా నిలిచాడు. సిడ్నీలో సెంచరీ చేసిన పుజారాకు ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ ఐదో టెస్టు కావడం విశేషం. విదేశీ గడ్డపై ఆడిన టెస్టు సిరీస్ ల్లో చటేశ్వర్ పుజారా ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు సాధించడం ఇదే తొలిసారి.  భారత మాజీ బ్యాట్స్ మన్ వీవీఎస్ లక్ష్మణ్ 17 టెస్టుల సెంచరీ రికార్డును ఈ సెంచరీతో తిరగరాసి తన ఖాతాలో వేసుకున్నాడు పుజారా.

India vs Australia
Cheteshwar Pujara
Pujara Test Career
IND vs AUS
4th Test Sydney

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు