సూపర్ కింగ్స్: 10సీజన్లలో 8సార్లు ఫైనల్‌కి..

Submitted on 11 May 2019
Chennai Super Kings: 8 finals in 10 seasons

వైజాగ్ వేదికగా జరిగిన క్వాలిఫయర్ 2మ్యాచ్‌లో విజయం సాధించి ఐపీఎల్‌లో 8వ సారి ఫైనల్‌కు చేరింది సూపర్ కింగ్స్. డిల్లీ క్యాపిటల్స్‌పై 6వికెట్ల తేడాతో గెలుపొందింది. లీగ్‌లో ఫైనల్‌కు ఎక్కువ సార్లు అర్హత సాధించిన జట్టుగానూ చెన్నై ఘనత పొందింది. సీజన్ల వారీగా ఫైనల్ అర్హత సాధించిన ఫ్రాంచైజీలను పరిశీలిస్తే..


2008 సీజన్‌లో:
విన్నర్: రాజస్థాన్ రాయల్స్
రన్నరప్: చెన్నై సూపర్ కింగ్స్
ఆరంభ సీజన్లో షేన్ వార్న్ కెప్టెన్సీలో రాజస్తాన్ రాయల్స్ ట్రోఫీ గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో ధోనీ జట్టును 163పరుగులకు కట్టడి చేసి 3వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాన్ ఆఫ్ ధ మ్యాచ్ యూసఫ్ పఠాన్‌కు దక్కింది. 


2010 సీజన్‌లో:
విన్నర్: చెన్నై సూపర్ కింగ్స్
రన్నరప్: ముంబై ఇండియన్స్
ఈ మ్యాచ్‌లో హైలెట్‌గా సురేశ్ రైనా 57 నాటౌట్‌తో అద్భుతమైన పరుగులు సాధించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 5వికెట్లు నష్టపోయి 168పరుగులు చేయగలిగింది. చేధనకు దిగిన ముంబై జట్టులో సచిన్ 48పరుగులు చేయగా, మిగిలిన బ్యాట్స్‌మెన్ రాణించలేకపోవడంతో జట్టు 22పరుగులతో ఓటమికి గురైంది. 


2011 సీజన్‌లో:
విన్నర్: చెన్నై సూపర్ కింగ్స్
రన్నరప్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
మూడో ఐపీఎల్ సీజన్లో ఫేవరేట్‌గా బరిలోకి దిగిన చెన్నైయే మరోసారి టైటిల్ విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో భారీ టార్గెట్‌ను నిర్దేశించి బెంగళూరుకు ముచ్చెమటలు పోయించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా మురళీ విజయ్ 95 పరుగులతో నిలవగా రెండో అత్యధిక పరుగుల స్కోరర్‌గా మైకెల్ హస్సై 63తో నిలిచాడు. ఫలితంగా చెన్నై 58పరుగుల తేడాతో విజయాన్ని దక్కించుకుంది. 


2012 సీజన్‌లో:
విన్నర్: కోల్‌కతా నైట్ రైడర్స్
రన్నరప్: చెన్నై సూపర్ కింగ్స్
మరోసారి సురేశ్ రైనా(73; 38బంతుల్లో) రాణించినప్పటికీ ఫైనల్ పోరాటంలో ఓటమి తప్పలేదు. చెన్నై నిర్దేశించిన 190పరుగుల టార్గెట్‌ను 2బంతులు మిగిలి ఉండగానే కోల్‌కతా గెలిచేసింది. మన్వీందర్ బిస్లా(89) మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకున్నాడు. 


2013 సీజన్‌లో:
విన్నర్: ముంబై ఇండియన్స్ 
రన్నరప్: చెన్నై సూపర్ కింగ్స్
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కీరన్ పొలార్డ్(60)ప్రదర్శనతో 9వికెట్లు నష్టపోయి ముంబై 148పరుగులు చేయగలిగింది. డేన్ బ్రావో 4వికెట్లు పడగొట్టినా ధోనీ(63)ప్రదర్శనకు ప్రయోజనం లేకుండాపోయింది. 23పరుగుల తేడాతో ఓటమికి గురైంది. 


2015 సీజన్‌లో:
విన్నర్: ముంబై ఇండియన్స్
రన్నరప్: చెన్నై సూపర్ కింగ్స్
ముంబై ఇండియన్స్ భారీగా రోహిత్ శర్మ(50; 26బంతుల్లో) రాణించడంతో 202 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ధోనీ జట్టు ఎట్టకేలకు 8వికెట్లు నష్టపోయి 161పరుగులు మాత్రమే చేయగలిగింది. మిచెల్ మెక్‌క్లెనగన్(3/25)తో బౌలింగ్ ప్రదర్శనతో చెన్నై పతనాన్ని శాసించాడు. 


2018 సీజన్‌లో:
విన్నర్: చెన్నై సూపర్ కింగ్స్
రన్నరప్: సన్‌రైజర్స్ హైదరాబాద్
రెండేళ్లు నిషేదానంతరం ఐపీఎల్లోకి అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ శుభారంభాన్ని నమోదు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 6వికెట్లు నష్టపోయి 178పరుగులు చేసింది. చేధనలో (ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్) షేన్ వాట్సన్(117; 57బంతుల్లో 11ఫోర్లు, 8సిక్సులు)తో చెలరేగడంతో చెన్నై 8వికెట్ల తేడాతో గెలుపొందింది. 


 

chennai super kings
CSK
MS Dhoni
IPL 2019
IPL 12
IPL

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు