కరువు వెక్కిరిస్తోంది : చెన్నైవాసుల తాగునీటి కష్టాలు తప్పేనా?

Submitted on 9 April 2019
Chennai Stares massive water supply problems as lakes dry, Metro board says can manage 

సమ్మర్ వచ్చిందంటే.. చెన్నై వాసులను నీళ్ల కష్టాలు వెంటాడుతున్నాయి. జలవనరులు అడుగు అంటిపోతున్నాయి. మార్చినెలలోనే నీటి ఎద్దడితో నగర వాసులు అల్లాడిపోయారు. రానున్న రోజుల్లో నీటి కొరత తీవ్ర స్థాయికి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చెన్నైలోని పలు నగర ప్రాంతాల్లో కరువు సంభవించింది. నీటి సరఫరా సరిగా లేక నీటి కష్టాలు పడుతున్నారు. చెన్నై మెట్రోవాటర్ బోర్డు అందించే నీటి సరఫరా నగరవాసులందరికి ఎంతమందికి సరిపోతుందనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. నదులు, చెరువుల్లో నీళ్లు ఇంకిపోతున్నాయి. రిజర్వాయర్లలో నీటిమట్టం స్థాయి రోజురోజుకి దిగువ స్థాయికి పడిపోతుంది. ఏప్రిల్ ఆరంభంలోనే ఇలా ఉంటే.. వచ్చే గాడ్పు మేనెలలో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందోనని నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. స్థానికంగా నీటి కొరతను ఎదుర్కొనే స్థానిక వాసులు తమ బాధను చెప్పుకుంటున్నారు. వెలచేరి ప్రాంతానికి చెందిన నిత్య అనే మహిళ.. తమ ప్రాంతంలోని నీటి సమస్యపై ఆవేదన వ్యక్తం చేసింది.
Read Also : లక్ష్మీపార్వతి జోస్యం : వైసీపీకి 125 ఎమ్మెల్యే , 22 ఎంపీ సీట్లు ఖాయం

మార్చిలోనే నీళ్లకు కటకట :
మార్చి ఆరంభం నుంచే తాము నీటి కష్టాలు పడుతున్నట్టు తెలిపింది. నీటి సరఫరా సరిగా లేదని, నీళ్ల ట్యాంకులపైనే ఆధారపడాల్సి వస్తోందని చెప్పింది. వాటర్ బుకింగ్ చేసుకున్న వారం తరువాత నీళ్ల ట్యాంకర్లను పంపిస్తున్నారని వాపోయింది. మెట్రో వాటర్ పై తాము ఆధారపడటం లేదని, సమ్మర్ లో బోర్ వెల్ నే వాడుతున్నామని అనితా అనే మరో మహిళ చెప్పింది. బోర్ వెల్ ల్లో నీటి స్థాయి పడిపోయిందని, అందుకే పక్క ప్లాట్లకు నీటిని తక్కువ స్థాయిలో అరువు ఇస్తున్నట్టు తెలిపింది. ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు నీటి సరఫరా చేస్తామని తెలిపింది. సాయంత్రం పూట అరగంట పాటు నీటి సరఫరా అందిస్తామని చెప్పింది. ఇటీవలే తమ అపార్ట్ మెంట్ లో బోర్ వెల్ ను మరో 350 అడుగుల వరకు తీయించినట్టు చెప్పింది. అయినప్పటికీ నీటి సరఫరా తగినంత స్థాయిలో లేదని తెలిపింది. 

నీటి సరఫరాపై పరిమితి :
రిజర్వాయర్లలో నీటి స్థాయి ఆధారంగా చెన్నైలో నీటి సరఫరాను అందించడంలో పరిమితులు విధించారు. సోమవారం పూండి రిజర్వాయర్లలో నీటిమట్టం స్థాయి 300మిలియన్ల క్యూబిక్ ఫీట్ ఉండగా.. పూర్తిస్థాయి నీటిమట్టం 3వేల 231 మిలియన్ల క్యూబిక్ అడుగుల వరకు ఉంటుంది. అదేవిధంగా షోలవరంలో నీటిమట్టం స్థాయి 35ఎంసీఎఫ్టీ ఉండగా.. దాని కెపాసిటీ మాత్రం 1,081ఎంసీఎఫ్టీ వరకు ఉంటుంది. రెడ్ హిల్స్ చెరువు నీటి మట్టం కూడా 260ఎంసీఎఫ్ టీ వరకు పడిపోయింది. దీని పూర్తిస్థాయి నీటిమట్టం 3వేల 300ఎంసీఎఫ్ టీ వరకు ఉంటుంది. చంబరంబక్కమ్ రిజర్వాయర్ నీటిమట్టం మాత్రం 7 ఎంసీఎఫ్టీ వరకు మాత్రమే ఉంది. అసలు కెఫాసిటీ 3,645 ఎంసీఎఫ్ టీ వరకు ఉంటుంది. వీరనామ్ చెరువులో మెట్టూర్ డ్యామ్ నుంచి వచ్చే ఇన్ ఫ్లో 543.08 ఎంసీఎఫ్ టీ నీళ్లు వదిలారు.  2019 ఏడాదితో పోలిస్తే.. 2018 ఏడాదిలో చెన్నై రిజర్వాయర్లలో నీటి స్థాయి అత్యధిక స్థాయిలో ఉంది. 2018లో ఇదే నెలలో పూండి రిజర్వాయర్ లో 1,365 నీటిమట్టం స్థాయి ఉంది. చోలవరంలో 83ఎంసీఎఫ్ టీ నీళ్లు ఉన్నాయి. రెడ్ హిల్స్, చెంబరబక్కంలో 1,751 నీటిమట్టం, 1,114ఎంసీఎఫ్టీ వరకు నీళ్లు ఉన్నాయి. 

500MLD తగ్గించే యోచనలో బోర్డు :
చెన్నైలో ఇంకిపోతున్న జలవనరులపై నగర మెట్రో వాటర్ సప్లయ్ అండ్ సేవరేజ్ బోర్డు (CMWSSB) సీనియర్ అధికారి మాట్లాడుతూ.. చెన్నై నగర రిజర్వాయర్లు ప్రమాద స్థాయికి అడుగంటిపోతున్నాయి. వీరనం చెరువులో నీటిమట్టం స్థాయి బాగానే ఉందన్నారు. నగరంలో ప్రస్తుతం పీక్ సీజన్ లో 830ఎంఎల్ డీ వరకు నీటి అవసరం అవుతోంది. దీన్ని బోర్డు 550ఎంఎల్ డీ (రోజుకు మిలియన్ లీటర్ల నీళ్లు) కి తగ్గించింది. రానున్న రోజుల్లో 500ఎంఎల్ డీ వరకు తగ్గించే యోచనలో ఉన్నట్టు తెలిపారు. చెన్నైలో నీటి కొరత అంత అధ్వానంగా లేదన్నారు. వర్షంపై ఆధారపడకుండా.. ప్రస్తుం నగరంలో 480 ఎంఎల్ డీ నీటిని సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. చెన్నైలోని నాలుగు చెరువుల నుంచి మాత్రమే కాదు.. వీరనాం, క్వారీలు, అంతర జలాలు, వ్యవసాయ బావుల నుంచి నీటిని సేకరిస్తున్నట్టు తెలిపారు. చెన్నై నగరవాసులకు నీటి కొరత సమస్య గతంలో భారీస్థాయిలో ఉందని, ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి లేదన్నారు. CMWSSB బోర్డు చాలా విశ్వాసంతో ఉందని, నీటి సమస్య పరిస్థితి చేయిదాటిపోలేదన్నారు.

నీటి కొరతను అధిగమిస్తాం :
వాటర్ ప్లాంట్ల నుంచి నీటిని సరఫరా చేస్తున్నామని చెప్పారు. నీళ్ల విషయంలో తమకు ఎలాంటి ఆందోళన లేదన్నారు. రానున్న రోజుల్లో కూడా నీటి సమస్యను ఎదుర్కొనేందుకు బోర్డు సిద్ధంగా ఉందని, దూరదృష్టితో నీటిని సరఫరా చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. నగరంలోని కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరా అందక అక్కడి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారనే వాదనకు సమాధానంగా సీనియర్ అధికారి బదులిచ్చారు. CMWSSB బోర్డు ఆయా నగర ప్రాంతాలకు చిన్ని వాహనాల్లో నీటిని సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. 3వేల కెపాసిటీ కలిగిన వాటర్ ట్యాంకులను పంపిస్తున్నట్టు చెప్పారు. చిన్న చిన్న వాటర్ ట్యాంకుల్లో నీటిని సరఫరా చేసి ప్రతిఒక్కరికి నీళ్లు అందేలా చేస్తున్నట్టు తెలిపారు. సాధారణ రోజుల్లో కంటే.. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు.. మూడురోజులకు ఒకసారి నీటి సరఫరా విషయంలో పరిమితి విధిస్తున్నట్టు చెప్పారు. 
Read Also : నేను జగన్‌లా కాదు : వాళ్ల బిస్కెట్లకు ఆశపడను, టీఆర్ఎస్‌లో కలవను

chennai city
massive water supply crisis
lakes dry
CMWSSB Metro board

మరిన్ని వార్తలు