మోసాల ముఠాలో అడ్వకేట్  : మెట్రో ఉద్యోగాలంటు ముంచేశారు

Submitted on 18 January 2019
Cheating team arrest under the name of Metro Rail Jobs In Hyderabad

హైదరాబాద్ : ఉద్యోగాల పేరుతో మోసాలు కొనసాగుతునే వున్నాయి. నిరుద్యోగుల వీక్ నెస్ ను ఆసరాగా చేసుకున్న మరో మోసాల రాయుళ్ల ముఠా గుట్టు రట్టయ్యింది. మెట్రో రైలులో ఉద్యోగాల పేరుతో 161 మందికి నామ పెట్టేసింది ఓ ముఠా. పలు కంపెనీల్లో పీఆర్ఓగా పనిచేస్తు నిరుద్యోగులకు గాలం వేసేందుకు ఓ ముఠాను తయారుచేసుకున్నాడు రామకృష్ణ అనే వ్యక్తి. హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో వుంటున్న వెలగపూడి రామకృష్ణ, నిజామాబాద్‌కు చెందిన చిల్ల మహాలక్ష్మి, హైదరాబాద్ ఎస్సార్ నగర్‌కు చెందిన హైకోర్టు అడ్వకేట్ గడ్డం శ్రీధర్‌రెడ్డి, మంచిర్యాలకు చెందిన బండారు లక్ష్మణరావులు ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఈ క్రమంలో మెట్రో రైలులో ఉద్యోగాలు ఇప్పిస్తామంటు 161 మందిని నమ్మించి రూ. 80 లక్షలు వసూలు చేశారు. సంవత్సరం నుండి ఈ మోసాలకు పాల్పడుతు..రామకృష్ణ సంపాదించిన డబ్బుతో రూ. 23 లక్షలు ఖర్చు చేసి నిజామాబాద్‌లోని ఫతేనగర్‌లో మహాలక్ష్మికి ఇల్లు కూడా కట్టించాడు. ముఠాలోని మిగతా ఇద్దరు శ్రీధర్ రెడ్డి, లక్ష్మణరావులకు చెరో పది శాతం వాటా ఇచ్చాడు. 

ఇలా సాగినంత కాలం మోసాలు చేస్తున్న ఈ మోసాల ముఠా మోసం బైటపడుతుందని రామకృష్ణ మరో ప్లాన్ వేశాడు.ఎల్ అండ్ టీ వైస్ ప్రెసిడెంట్ పి.రాధికారెడ్డి పేరుతో నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు సృష్టించి వారికిచ్చాడు. దిల్ సుఖ్‌నగర్‌లో ఉంటున్న లావణ్య ఆ అపాయింట్ మెంట్ లెటర్ తో మెట్రో అధికారులను కలవడంతో ఈ మోసం బైటపడటంతో ఆమె ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తులో భాగంగా మోసాల ముఠా  రామకృష్ణ, మహాలక్ష్మిలను జనవరి 17న  అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శ్రీధర్‌రెడ్డి, లక్ష్మణరావు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి కారు, నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు, రూ. 70 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు సదరు మోసగాళ్లు చిక్కారు. 

Telangana
Hyderabad
Metrorail
jobs
cheating
PRO
Ramakrishna
Advocate
Sridhar Reddy
Lakshmana Rao
Chila Mahalakshmi

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు